టీడీపీ కి దాసరి బ్రదర్ షాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం పార్టీకి మరో షాక్..! టీడీపీ మాజీ ఎమ్మెల్యే డెయిరీ డాక్టర్ దాసరి వెంకట బాలవర్థన్‌ రావు వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ లో చేరారు. ఈయన శుక్రవారం నాడు తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు అనంతరం వైసీపీ అధినేత జగన్ సమక్షం లో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సంధర్భంగా ఆయనని జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

గన్నవరం నియోజకవర్గాని ఇది వరకు ఆయన ఎమ్మెల్యే గా పని చేశారు ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లా విజయ డెయిరీ లో ఆయన డాక్టర్ గా పని చేస్తున్నారు. ఈయన సోదరుడు దాసరి జై రమేష్ ఇది వరకే జగన్ సమక్షం లో వైసీపీ లో చేరిన విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా ఈరోజు ఆయన సోదరుడు వైసీపీ లో చేరే కార్యక్రమంలో జై రమేష్ కూడా పాల్గొన్నారు. వైసీపీ కార్యాలంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఇక వీరందరి శాంక్షమ్ ఆయన పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. వైసీపీలో చేరిన అనంతరం బాలవర్ధన్ మాట్లాడుతూ.. ‘ ఎలాంటి హామీలు అడగకుండా వైసీపీ లో చేరాను.. ఎందుకంటే నా నియోజకవర్గం లో పార్టీ కార్యకర్తల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జగన్ కష్టాలు తీరుస్తాడనే నమ్మకం తో ఉన్నాను.. వైసీపీ పార్టీకీ పని చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.’

Share.

Comments are closed.

%d bloggers like this: