మహిళా సాధికారత కాంగ్రెస్ కి మాత్రమే సొంతం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు జరిగిన మహిళా కాంగ్రెస్ సదస్సుకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన ముఖ్యతాను కల్పించబోయే పథకాలను దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితే కలిగే లాభాలను ఆయన తన ప్రసంగం ద్వారా వెల్లడించారు. ఈ సంధర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీ లపై ఆయన ఫైరయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మహిళలకు ఎప్పుడూ ఉన్నతమైన స్థానం కల్పిస్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం మహిళా నాయకత్వంలో నడుస్తోంది.. దేశానికి తొలి మహిళా ప్రధానిని అందించింన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచితమైన స్థానాలు కేటాయించింది అన్నారు. మహిళలకు రాజకీయంగా.. ఆర్థిక సాధికారతకు కాంగ్రెస్ కృషి చేసింది అన్నారు.

మోదీ.. కేసీఆర్ పాలనలో మహిళా సాధికారతకు ప్రాధాన్యతే లేదు. దేశంలో మహిళ లేకుండా ఉన్న ఏకైక క్యాబినెట్ కేసీఆర్ క్యాబినెట్ మాత్రమే. మోదీ పాలనలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది అని ఆయన అన్నారు. మోదీతో కేసీఆర్ కు లోపాయకారి ఒప్పందం ఉంది.. ఈ విషయాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని అక్కడున్న కార్యకర్తలని ఉత్తమ్ కోరారు. మోదీ పాలనలో నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయింది.. బీజేపీ సర్కార్ పాలనలో దేశంలో రైతుల జీవితాలు దుర్బరం అయ్యాయి అని ఆయన అన్నారు. మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు. రాహుల్ ప్రధాని కావడం దేశానికి ఎంతో అవసరం..రాహుల్ సభలో.. కనీస ఆదాయ పథకం.. ఉద్యోగ కల్పనపై స్పష్టమైన హామీ ఇవ్వబోతున్నారు అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: