లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ విడుదల పై వర్మ సంచలన ట్వీట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈయన ఏం చేసిన అది వివాదమే.. అది పక్కా సంచలనమే..! అయితే ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సంధర్భంగా రామ్ గోపాల్ వర్మ తను తీస్తున్న లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ సినిమా ట్రైలర్ ని ఇవాళ ఉదయం విడుదల చేశాడు. ఇక ఈ ట్రైలర్ కి భారీ స్పందన లభిస్తుంది.

ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది మరి సినిమా విడుదల విషయానికొస్తే.. తాను విడుదల చేయబోతున్న లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ పై గత కొన్ని రోజులుగా కొందరు ఈ సినిమాని విడుదల అవ్వనివ్వకుండా ప్రయత్నిస్తున్నారని సెన్సార్ బోర్డ్ తరఫునా ఆపుదామని చూసినప్పటికి విఫలమయ్యారు అంటూ ఇది వరకే వర్మ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ విషయం ఇలా ఉంటే తాజాగా శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మరో ట్వీట్ చేశాడు.. ఇక ఈ ట్వీట్ ఇప్పుడు సంచాలనం రేపే రీతిలో ఉంది. సినిమా విడుదల విషయాన్నే మళ్ళీ ప్రస్తావిస్తూ వర్మ తన ట్విట్టర్ ద్వారా.. నా సినిమా లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ ని విడుదల అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు..ఎవ్వరైన నా సినిమా ని ఆపాలనుంకుంటే వారికి ఒకే దారి ఉంది.. అది నన్ను చంపడమే..! నన్ను చంపగలిగితేనే ఆ సినిమా ఆగుతుంది అంటూ ట్వీట్ చేశాడు. నా నగ్నమైన ఆలోచనా శైలిని తెలుసుకోవాలంటే నా ఇంటెర్వ్యూ చూడండి అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: