సైకిల్ ఎక్కిన కౌశల్..! ప్రచారానికి గ్లామర్ తోడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బస్-2 సీజన్ కంటే అందులోని అభ్యర్థి మరియు విజేత కౌశల్ కే ఎక్కువ పాపులారిటీ వచ్చిందని నిస్సందేహంగా చెప్పొచ్చు..ఒక పట్టాన కౌశల్ వల్లే సీజన్ 2 కి అంతా హైప్ వచ్చింది. బిగ్ బస్ చరిత్ర లోనే ఎన్నడూ లేనట్టి భారీ ఓట్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు కౌశల్.. ఈయనకీ అభిమానం అంతా ఇంతా లేదు.. కౌశల్ కి మన రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బిగ్ బస్ సీజన్ వల్ల అంతర్జాతీయంగా కూడా కౌశల్ కి అభిమానం వ్యక్తమయ్యింది. కౌశల్ బిగ్ బస్ ఇంట్లో ఉన్నప్పుడూ ఆయన పై అనేక పాటలు కూడా వచ్చాయి. అభిమానులు అందరూ కలిసి ముందు గుంపులుగా ఆపై కౌశల్ ఆర్మీగా ఒక్కటయ్యారు వివిద రాష్టాల్లో భారీ సంఖ్యాల్లో ర్యాలీలు కూడా తీశారు.. ఈ కౌశల్ ఆర్మీ అభిమాన సంఘాలకీ స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ కమిటీలు ఉన్నాయంటే మీరే ఆలోచించుకోండి..

అయితే బిగ్ బస్ గెలిచిన నాటినుంచి కౌశల్ వివిద సంక్షేమ పనులు చేస్తున్నాడు. తన ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలా సంస్థలకి ఫండ్స్ అందించాడు. ఇక ఈ సేవ కార్యక్రామాలకి రాజకీయ వేధిక దొరికితే ఇంకా బాగా చేయొచ్చని భావించాడు. తనకున్న ఫాలోయింగ్ ని క్యాష్ ఇన్ చేసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సిద్ధాంగున్నాడు. ఈ తరహా ఫాలోయింగ్ ని రాజకీయ రంగంలోకి తీసుకెళితే తనకి తిరుగే ఉండదని భావించాడు. ఈ నేపధ్యంలో కొంత కాలంగా టీడీపీ పార్టీలో చేరాలని కౌశల్ అనుకున్నాడు.. అనకాపల్లి టికెట్ గురించి కూడా కౌశల్ ఆశిస్తునట్టు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో ఆయన టీడీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేయనున్నారు. శుక్రవారం రాత్రి కౌశల్ ఏపీ సీఎం చంద్రబాబును అమరావతిలో కలిశారు. కౌశల్ వెంట రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కౌశల్‌ టీడీపీతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. కౌశల్‌ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు కౌశల్ వెల్లడించారు. పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టే వ్యూహంతోనే కౌశల్‌ను టీడీపీ నేతలు రంగంలోకి దించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కౌశల్ పార్టీ కోసం ప్రచారం చేస్తే యువ ఓటర్లను ఆకర్షించవచ్చని టీడీపీ నేతలు లెక్కలు వేసారు.

Share.

Comments are closed.

%d bloggers like this: