సైకిల్ కి చేయి..! ఫ్యాన్ కి సై..! వైసీపీ లోకి అలీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సోమవారం ఉదయం వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు అలీ భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన వైసీపీలో చేరారు. అలీ.. సడెన్ గా మనసు మార్చుకున్నారు ఆయన మొన్న టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసిన సంగతి తెలిసిందే.. అయితే బాబుని కలిసిన అలీ గుంటూరు టికెట్ అడిగగా దానికి బాబు ఒప్పుకునట్టు కథనాలు కూడా వచ్చాయి. మరి సడన్ గా ఏమయ్యిందో ఏమో ఆయన ఇలా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

సుమారు పావుగంట సేపు భేటీ అయిన అనంతరం అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. అలీకి పార్టీ కండువా కప్పి జగన్‌ సాదరంగా ఆయనని పార్టీలోకి ఆహ్వానించారు. అలీ వెంట నటుడు కృష్ణుడు ఉన్నారు. కాగా.. టికెట్‌పై జగన్‌ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది. వైసీపీ తరఫున అలీ.. గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. నిన్నటి వరకు ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. గతంలో వరసగా జగన్, చంద్రబాబు, పవన్ లతో భేటీ అయ్యారు. తాజాగా.. వైసీపీలో బెర్తు ఖరారు చేసుకున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: