నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ 10 కోట్లకి స్కెచ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాను ఐఏఎస్ అని చెప్పి చాలా మందిని ముంచేశాడు ఓ నకిలీ ఐఏఎస్ మోసగాడు. ఇదొక్కటే కాకుండా పార్లమెంట్ లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పి చాలా మంది అమాయక జనం దేగ్గర డబ్బు తీసుకొని వారికి ఉద్యోగాలు పెట్టిస్తానని మాయ మాటలు చెప్పి బోల్తా కొట్టించాడు హైదరాబాద్ కి చందిన ఓ వ్యక్తి.

వివరాల్లోకి వెళితే.. వరంగల్ కి చెందిన సంపత్ కుమార్ (29) హైదరాబాద్ మేడిపల్లి లో నివసిస్తాడు. ఏదైయానా చేసి చాలా డబ్బు సంపాదించేయాలని భావించాడు అందుకు మంచి మార్గం పట్టకుండా ముంచే మార్గాన్ని ఎంచుకున్నాడు. నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి తాను ఐఏఎస్ అధికారిని అని ప్రజలని నమ్మించాడు. ఇక తన అనైతిక చర్యలు ప్రారంభించాడు. పార్లమెంట్ లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పి చాలా మంది అమాయక జనాన్ని మోసం చేశాడు మాయ మాటలు చెప్పి వారికి ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి దాదాపుగా 20 మంది నుండి 6 కోట్ల దాకా వసూళ్లు చేశాడు.

ఇది చాలక ఇంకో కోటికి ఎసరు వేయాలని చూశాడు. ఈసారి ధర్మకర్త రూపం దాల్చి చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో ని మలక్ పేట లో ఓ టెంపుల్ వద్ద తనకు తాను ధర్మ కర్తని అని చెప్పుకొని 60 వేలు విరాళాలు ఇచ్చి ఆపై కోటి ముప్పై ఎనమిది లక్షలు మిగితా వారందరి దేగ్గర వసూళ్లు చేశాడు.. ఇలా వీరు 1.5 కోట్లు జమ చేస్తే hudco నుంచి మరో 3కోట్ల నిదులు తెప్పిస్తానని చెప్పాడు. నిదులు జాప్యం అవుతున్నాయి ఇంకా రావట్లేదు ఇక అక్కడి ప్రజలకి అనుమానం వచ్చి బాదితులు పోలీసులకి ఫిర్యాదు చేయగా నిందితుడిని పక్క ప్రణాళిక వేసి దిల్ సుఖ్ నగర్ వద్ద ల్యాప్టాప్ రిపైర్ షాప్ వద్దా పట్టుకున్నారు. అతని వద్ద నుండి ఒక ల్యాప్తోప్ 5 డెబిట్ కార్డులు నాలుగున్నర తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక బాడితుదిని విచారణ చేసి రిమాండ్ కి తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: