‘వెన్నుపోటు’ వీడియో బయట పెట్టిన ఆర్‌జీవీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే ఎవ్వరికైనా ఏదో ఒక వివాదమే మనసు లోకి వస్తుంది. ఎందుకంటే ఈ దర్శకుడు ఎప్పుడూ వివాదాలను తన చుట్టూ పెట్టుకొని వాటి వెంటే పయనిస్తుంటాడు. వర్మ అంటేనే వివాదం అని తనకి ఓ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ప్రస్తుతం వర్మ లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ చిత్రం రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. ఇక వర్మ తీస్తున్న సినిమా అంటే అదో సెన్సేషనే అని చెప్పాలి పైగా అధి చంద్రబాబుని విలన్ గా చూపిస్తూ తీస్తున్నాడు.. ఈ సినిమాకి అంతా ఇంతా హైప్ రావట్లేదు. రిలీజ్ కి ముందే ఇంత హైప్ సాదిస్తుందంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు. సినిమా కి సంబంధించి ఇప్పటికే రెండు ట్రైలర్లని వర్మ రిలీజ్ చేశాడు ఇక ఒక్కో పాటని మార్కెట్ లోకి వదులుతున్నాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ సందేశం అంటూ వర్మ ఒక విడియోని రిలీజ్ చేశాడు.. ఇప్పుడూ ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియో లో ‘’ఎన్‌టి‌ఆర్ స్వయానా చంద్రబాబు తనని వెనక నుండి ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పారు’’ అని చూపారు. ఈ వ్యాఖ్యలు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు రాసిన పుస్తకం నుండి తీసుకున్నారు.. ఇక ఈ వ్యాఖ్యలని విద్యో రూపం లోకి మార్చి వారం విడుదల చేశాడు. ఈ వీడియో లో స్వయానా ఎన్‌టి‌ఆర్ మాట్లాడుతూ.. ”చంద్రబాబు గాడ్సే కన్నా అధముడు..’’ ‘’చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదూ.. నాకు అధికారం ఇచ్చిన మీకు.. నాకు ఓటేసిన ప్రజలకు’’ అంటూ ఎంతో భావోద్వేగంతో ఆవేశంతో చెబుతారు. ఈ వీడియో ఇప్పుడూ చాలా వైరల్ అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: