కరణ్ భాకి తీర్చుకొనున్న రాజమౌళి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి సినిమా సౌత్ లో ఆడడానికి రాజమౌళి ఎంతగానో కష్టపడ్డాడు. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ కొట్టడానికి కరణ్ జోహర్ ప్రమోషన్స్ చేశారు. ఆ విజయానికి కరణ్ జోహర్ పాత్ర చాలా కీలకమైనది. నేషనల్ లెవల్ మార్కెట్ సంపాదించడానికి ఆయన కూడా ఒక కారణమని జక్కన్న ఎన్నో సార్లు చెప్పాడు.

అయితే ఇప్పుడు ఆ బాకీ తీర్చే పని రాజమౌళి పై పడింది. బాలీవుడ్ లో మునుపెన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు బ్రహ్మాస్త్ర సినిమా ప్రస్తుతం మూడు భాగాల ఈ సినిమాలో మొదటి భాగం షూటింగ్ నడుస్తుంది ఇంకా రెండు పార్ట్ లు ఈ సినిమా తరువాత రూపొందిస్తారు. ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాభ్ బచ్చన్, ఆళియ భట్, రాంబిర్ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా టాలీవుడ్ మన్మదుడు నాగ్ కూడా ఒక ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు. ఇక జక్కన్న ఇప్పుడూ ఈ సినిమాకి సౌత్ లో ప్రమోషన్స్ చేయాలట. తెలుగు తమిళం కన్నడ బాషల్లో కూడా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట.. కాబట్టి కరణ్ జోహర్ జక్కన్న అయితేనే సరిగ్గా ప్రమోషన్స్ చేయగలరని భావించిన కరణ్ జక్కన్న ని అడగటం జరిగింది. ఇక బాహుబలికి కరణ్ మేలు చేసినందుకు ఇప్పుడు రాజమాఔలి కరణ్ కి తిరిగి సహాయం చేయడానికి సిద్ధమయ్యాడు.

ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జూ ఎన్‌టి‌ఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించడం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా భారీ ఖర్చు తో తయారవుతుంది. కానీ ఈ సినిమా షూటింగ్ కి ఎలాంటి అడ్డు పడకుండా చర్యలు తీసుకుందామని యత్నాలు చేస్తున్నాడు రాజమౌళి. ఇక ఈ సినిమా తో సమంగా రాజమౌళి బ్రహ్మాస్త్ర కి కూడా ప్రమోషన్స్ చేయనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: