కాంగ్రెస్ కి వైఎస్ లాంటి లీడర్ కావాలి-బైరెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాలుగు నెలల క్రితం రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అప్పటినుండి కాంగ్రెస్ పార్టీ బలానికై కాంగ్రెస్ తరఫున పోరాడుతున్నారు. మునుపు కూడా సమైక్య వాదాన్ని గట్టిగా వినిపించారు ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ గురించి కృషి చేస్తున్నాడు. నేడు ఆయన కాంగ్రెస్ పార్టీ లో వైఖరి పై మండి పడ్డారు..

ఆయన మాట్లాడుతూ.. ‘ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం ఉందని భావించి కాంగ్రెస్ లో చేరాను. కర్నూల్ కు రాహుల్ ను ఆహ్వానించి భారీ సభ నిర్వహించి విజయవంతం కూడా చేశాను. కాంగ్రెస్ బలపడాలని ఆశించా, పార్టీకోసం సర్వశక్తులు ఒడ్డి పోసి పనిచేసా..! పదవులు వస్తాయని ఆశతో కాంగ్రెస్ లో చేరలేదు..! రాహుల్ ప్రధాని అయితే ప్రత్యేక హోదా వస్తుందని భావించి చేరాను.
రాహుల్ ప్రకటించిన పథకాలు ప్రజలు నమ్మి కొన్ని సీట్లు అయినా వస్తాయని భావించాను. కోట్ల, కాంగ్రెస్ ను వీడిన తరువాత చాలా మంది పార్టీలో చేరారు. ఐదేళ్లలో రఘువీరా కాంగ్రెస్ ను మరింత దిగజార్చారు. కాంగ్రెస్ నాశనం కావడానికి రఘువీరానే కారణం. కాంగ్రెస్ నుంచి అందరిని బయటికి పంపింది రఘువీరానే..!

ఓడిపోయే వాళ్లనే కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు. రెండు పార్టీలతో బేరసారాలు పెట్టుకున్నారు. నన్ను పిసిసి అధ్యక్షునిగా మార్చకపోతే కాంగ్రెస్ కు ఉనికి ఉండదు. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. రేపు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటా. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై రాహుల్ గాంధీకి లేఖ రాసా. కాంగ్రెస్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నాయకుడు కావాలి…అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: