తమ్ముడి కోసం అన్నయ బరిలోకి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జ‌న‌సేన తరఫున ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల ఖ‌రారు పై పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. అయితే, ఆశ్చ‌ర్‌బక‌రంగా ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధులుగా పోటీ చేసే లిస్టు లోని కొంద‌రు కీల‌క వ్య‌క్తుల పేర్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. అందులో ప్ర‌ధానంగా ప‌వ‌న్ క‌ళ్యాన్ రెండు స్థానాల నుండి పోటీకి దిగుతున్న‌ట్లు స‌మాచారం. రాయ‌ల‌సీమ తో పాటుగా విశాఖలో మ‌రో స్థానం ఎంచుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఈ విషయం ఇలా ఉంటే.. నాగబాబు ప్ర‌జారాజ్యంలో అన్న‌య్య చిరంజీవి కోసం శ‌క్తి వంచ‌న లేకుండా ప‌న చేసినప్పటికీ ఆ స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. అయితే, ఇప్పుడు త‌మ్ముడు పార్టీ జ‌న‌సేన నుండి మాత్రం ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశాలు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. గుంటూరులో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో తాను సాధార‌ణ కార్య‌క‌ర్త‌ను మాత్ర‌మే అని చెప్పిన నాగ‌బాబును ఎంపీగా బ‌రిలోకి దింపాల‌నేది ప‌వ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. నాగబాబు ను గుంటూరు లేదా న‌ర్సాపురం నుండి జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీ చేయించాల‌ని భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అందులో భాగంగానే.. గుంటూరులో పార్టీ ప‌రిస్థితి పై నాగ‌బాబు ఆరా తీసిన‌ట్లు చెబుతున్నారు. నాగ‌బాబు బ‌రిలో దిగ‌టానికి ఆమోద ముద్ర వేయ‌గానే ఆయ‌న పేరు ప్ర‌క‌టించేందుకు రంగం సిద్ద‌మైంది. ఇదే జ‌రిగితే ఆ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ అభ్య‌ర్ధుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: