బాబు ప్రచారం 16 న షురూ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు మొదలయ్యింది. ఎన్నికల తేదీ కూడా దేగ్గర పడుతుండటంతో అధినేతల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. ఒక పక్క టెన్షన్ మరో పక్క జోష్ ని ఒకేసారి మానేజ్ చేస్తున్నారు. ఇక రేపో మాపో ప్రధాన ప్రచారాలు కూడా మొదలవుతాయి.. ఇక రోడ్ షోలు బహిరంగ సభలు..! జిల్లాల వారీగా రోజుకొక సభతో కార్యకర్తల ఉత్సాహాన్ని మరింతగా పెంచుతారు.. ఓటర్లని ఆకర్షిస్తారు..! ప్రజలకి వారాల జల్లు కురిపిస్తారు.

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచారనిపై శ్రేద్ధ వహిస్తున్నారు. ఈ నెల పదిహేను నుండి ప్రాచారంలో భాగంగా ప్రజాదర్బార్ పేరుతో చేస్తున్నారు. జిల్లా వారీగా రోడ్ షో లు నిర్వహిస్తానని ముందుగానే ఆయన ప్రకటించారు. ఇక పోతే ఆ తేదీ కాస్త ఇప్పుడు 16 గా మారింది. ఇక 16 నుండి టీడీపీ అధినేత ప్రచారానికి ముహూర్తం పెట్టారు ముందుగా 16 ఉదయాన తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని ఆయన ప్రచారం పనులు మొదలుపెట్టనున్నారు . ఆపై మధ్యాన్నం 1 గంటల ప్రాంతానికీ తిరుపతిలో సేవామిత్ర, బూత్ కమిటీల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రాన శ్రీకాకుళం సభ.

ఇక మరుసటి రోజు 17న విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో సభలు. 18 న నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో సభలు.. 19న కర్నూల్,అనంతపూర్,కడప జిల్లాలో సభలు. ఈ సభల తరువాత బాబు.. బస్ యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక పోతే ఐటీ మంత్రి లోకేష్ మరో వైపు ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. ఒక ప్రాంతం లో బాబు ఉంటే మరో ప్రాంతం నుండి లోకేష్ ప్రచారం చేస్తారని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: