మరింత ఆసక్తికరంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ 8..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇదో ఆంగ్ల వెబ్ సిరీస్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటి వరకు 7 సీజన్స్ ఒక్కొక్కటి 10 ఎపిసోడ్ల చొప్పున విడుదలయ్యాయి. ఇక రాబోయే సీజనె ఈ వెబ్ సిరీస్ లో చివరిది. ఇప్పటికే ఈ సీజన్ గురించి అభిమానులు 2 ఏళ్ళు ఎదురు చూశారు కాగా ఏప్రిల్ 14 న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది. ఇదే చివరి సీజన్ అవ్వడం తో అందరూ ఉత్కంట తో వేచి చూస్తున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే ఈ సిరీస్ ని ఇండియా లో హాట్ స్టార్ అందించబోతుంది. నెట్ ఫ్లిక్స్ తో పాటు హాట్ స్టార్ లో కూడా ప్రసారమవుతుంది.

ఇప్పటికే ఈ 8వ సీజన్ ట్రైలర్లు సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. రెండు ట్రైలర్లు మరియు ప్రోమో ప్రజలని ఎంతగానో అలరిస్తున్నాయి. ఇదొక్కటే కాకుండా కథ కాస్త పెద్దదిగా ఉండటం తో గేమ్ ఆఫ్ థ్రోన్స్ యాజమాన్యం ఎపిసోడ్ రన్ టైమ్ ని పెంచాయి సాదారణం గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని ప్రతీ ఎపిసోడ్ 60 నిమిషాలకి మించి ఉండవు. కానీ ఇప్పుడు ప్రసారమయ్యే 8 వ సీజన్ లో షో రన్ టైమ్ ని 80 నిమిషాలుగా మార్చారు. 50 నిమిషాలకే అభిమానుల్లో ఆ రేంజ్ ఆసక్తి ఉంటే ఇప్పుడు 80 కి పెంచి ఆ ఆసక్తిని రెండింతలు చేశారు అనే చెప్పాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: