16 సీట్లు గెలుస్తే దేశన్నే శాసించవచ్చు-కేటీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జహీరాబాద్ లోని సభలో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు మాకు లేవంటూ.. మహారాష్ట్ర లోని 40 గ్రామాల ప్రజలు మమ్మల్ని తెలంగాణ లో కలపమని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చినా కరెంట్ లేని, నీళ్లు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దానికి కారణం ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన పార్టీలు కావా అని విమర్శించారు. అందుకే దేశానికి కేసీఆర్ సేవలు అవసరం..! కేసీఆర్ సేవలు అవసరం కనుక పార్లమెంట్ కు 16 స్థానాలు టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన అన్నాడు..

దాశరథి అన్నారు ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని, ఇక దాన్ని కేసీఆర్ నిరూపించేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ కోటి రతనాల మాగాణి చేయాలని తపన పడుతున్నాడు, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 24 గంటలు కరెంట్ అందిస్తున్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వముగా భూ రికార్డుల ప్రక్షాళన చేస్తారు. రైతులకు రైతు బంధు అందించారు. ఏప్రిల్ నుండి దాన్ని రెండంతలు చేస్తున్నాం. అన్ని రకాల పెన్షన్లు ఏప్రిల్ నుండి రెండింతలు చేస్తున్నాం.. సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేస్తున్నాం.

ఏపీలో.. పొలవరానికి జాతీయ హోదా ఇచ్చారు కానీ తెలంగాణలో కాళేశ్వరనికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. నీతి ఆయోగ్ అనే సంస్థ మిషన్ కాకతీయకు, మిషన్ భగీరతకు 24వేల కోట్లు ఇవ్వండని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు అందుకే 16 యంపీ స్థానాలు గెలుచుకుని కేంద్రానికి పంపితే మనకు కావలసిన నిధులు కోసం గట్టిగా కొట్లాడవచ్చు శాసించవచ్చని ఆయన అన్నారు. కేవలం 2 ఎంపీలతో తెలంగాణ సాధించిన కేసీఆర్, 16 యంపీలు గెలుస్తే ఢిల్లీనే శాశించవచ్చు అని శాసించేంత ఎదుగవచ్చని నమ్ముతున్నారని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: