ఎండలను మించిన ఎన్నికల సెగ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సెగ రాజుకున్న అగ్గి లాగా బగ్గుమంటుంది.. వేసవి ఎండలకన్నా రాజకీయ సెగలు ఎక్కువగా ఎగిసిపడుతున్నాయి. ఏ సమయం లో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. రాజకీయ విశ్లేషకులకి సైతం చమటలు పట్టేస్తున్నాయి. ఇక ప్రజలయితే తికమక పడుతున్నారు. ఎవ్వరూ గెలుస్తారో ప్రజల నిర్ణయం ఎలా ఉండబోతుందో ప్రజల నాడీ ఎంటో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ విషయం ఇలా ఉంటే పార్టీ అధినేతలకి షాక్ ల మీద షాక్ లు ఇచ్చేస్తున్నారు నేతలు.. సీనియర్లు సైతం ఇదే తోవ ని అనుసరిస్తున్నారు. ఏ నేత ఎప్పుడు పార్టీ ని వీడుతాడో ఎందుకు వీడుతాడో పసికట్టలేని వైనం. దింతో అధినేతలకి సీట్ల సద్ధుబాటే ఓ పెద్ద టాస్క్ లా మారిపోతుంది.

ఒక పక్క ఎన్నికల తేదీ విడుదల అయిపోయింది. సమయం రోజురోజుకి తగ్గిపోతుంది. ప్రజలు ఎంతగానో వేచి చూస్తున్నారు వారి ప్రియతమా నేత వారి గ్రామానికి ఎప్పుడొస్తారా ఎప్పుడు ప్రచారం చేస్తారా అని. ఇక సీట్ల సద్ధుబాటే ఒక టాస్క్ ల మారిందంటే ప్రచారాలకి తగిన వ్యూహాలు సిద్ధం చేసుకోడం ధానికి తగినంత టైమ్ కేటాయించడం మరో టాస్క్. దీంతో ఎలా మేనేజ్ చెటారో మరి వారికే తెలియాలి. పార్టీ నేతల్లో కూడా ఇప్పుడు ఇదే టెన్షన్. ఇక ప్రచారాలోలో ఫుల్ బిజీగా ఉండాల్సి ఉంటుంది. ప్రజల నాదిని పసికత్తి వారి కోరిక మేరకు ఏదో ఒక హామీ ఇవ్వక తప్పదు. మరి ఏం హామీలు ఇవ్వబోతున్నారో అనేదే ఇప్పుడో పెద్ద సవాల్..! మ్యానిఫెస్టో లో ఏమి కొత్తగా ఎండబోతున్నాయి…? ఇది వరకు చేసిన హామీలని అసలు తీర్చారా అనే ప్రశ్నలు ప్రజలకి ఉన్నాయి.. ఇక ఆయా పార్టీ అధినేతలే వీటికి సమాధానం చెప్పాల్సి ఉంది, ఇక రానున్న ప్రచారాలే వీరి గెలుపుని ఎఫెక్ట్ చేయగలవు. ప్రచారాలలో హామీలు ఇస్తారో ఒకరి పై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటారో వేచి చూడాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: