అద్భుతమైన ఫోన్ అతి తక్కువ దర..! క్షణాల్లో స్టాక్ ఫినీష్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

షావోమి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఫోన్ రెడ్‌మీ నోట్ సెవెన్ ప్రొ.. రెడ్‌మీ నోట్ సెవెన్ ప్రొ తో షావోమి ఫ్యాన్స్ కి ఒక అద్భుతమయిన గ్యాడ్జెట్ ని అందించారు ఆ సంస్థ యాజమాన్యం. కేవలం 13,999 కి ఒక వేరియంట్ ని 16,999 కి మరో వేరియంట్ ని విడుదల చేశారు. ఈ దర కి రిలీజ్ అయిన ఫోన్లలో రెడ్‌మీ నోట్ సెవెన్ ప్రొ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దర తక్కువగా పెట్టినప్పటికీ ఈ ఫోన్ కి ఇచ్చిన ఫెచర్లు చాలా అనునాతనమైనవి. అబ్ద్భుతమైన ఫీచర్లు ఉండటం వల్ల యువత ఈ ఫోన్ కై ఎగబడుతున్నారు. ఈ ఫోన్ భారత్ లో తొలిసారిగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్ కార్ట్ లో మరియు Mi.com లో విడుదల చేశారు. ఫోన్ సేల్ కి పెట్టిన క్షణాల్లోనే స్టాక్ అయిపోవడం గమనార్హం ఈ ఫోన్ కి ఉన్న డిమాండ్ కి నిదర్శనం. మునపటి మోడల్ అయిన నోట్ 6 ప్రొ మాదిరిగానే ఈ ఫోన్ లో కూడా 4000 ఎం‌ఏహె చ్ బ్యాటరీ ఉంది కాగా ఈ ఫోన్ కి వెనుకటి బాడీ పటిష్టమైన గొరిల్లా గ్లాస్ ని పెట్టింది సంస్థ. సైడ్ ఫ్రేమ్ కూడా ఎప్పటిలాగానే ఫైబర్ ఫ్రేమ్ ఉంది. ఇక మిగితా ఫీచర్లన్ని అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా 48 మెగా పిక్సల్స్ కెమెరా ఉండటం వివేశం. ఈ ఫోన్ ని కెమెరా బీస్ట్ గా యాజమాన్యం పేర్కొనింది.

రెడ్‌మీ నోట్ సెవెన్ ప్రో ఫీచర్లు :

1. 48 మెగా పిక్సల్స్ కెమెరా
2. పవర్ఫుల్ బ్యాటరీ
3. క్విక్ చర్జింగ్ 3
4. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ లేదా 8 గీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్.
5. ఇక ప్రాసెసర్ వచ్చేసి స్న్యప్ డ్రాగన్ 660 ఆక్టాకోర్ తో ఈ ఫోన్ ఈ దర కే ఒక బీస్ట్ గా మారిపోయింది.

6. డ్రాప్ నాట్చ్ డిజైన్

 

Share.

Comments are closed.

%d bloggers like this: