హైదరబాద్ షీ టీమ్స్ దేశం లోనే నంబర్ వన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరబాద్ దేశం లోనే మహిళా భద్రత విషయం లో నంబర్ వన్ స్థానం లో ఉంది. మహిళల భద్రతా విషయంలో హైదరాబాద్ షీ టీమ్ ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తుంది.. ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఇక తాజాగా మహిళల భద్రత విషయం లో హైదరబాద్ నంబర్ వన్ స్థానం లో ఉన్నట్టు వెల్లడయ్యింది. ఇక ఈ సంధర్భంగా హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సిపి శిఖ గోయల్ మీడియా ముందుకు వచ్చారు.

ఆమె మాట్లాడుతూ.. దేశం లోనే హైదరాబాద్ మహిళల భద్రత విషయం లో నంబర్ వన్ స్థానం లో ఉండటం గమనార్హం అని ఆమె ఆనింది. ఇందుకు గాను షి టీమ్ ఎంతగానో కష్టపడుతుందని ఆమె వెల్లడించింది. మహిళల భద్రత విషయం లో ఎన్నో చర్యలు చేపడుతున్నామని.. మహిళల భద్రతే ముఖ్య లక్ష్యంగా పని చేస్తున్నామని ఆమె వెల్లడించింది. ఈ సంధర్భంగా హైదరాబాద్ షీ టీం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో ఆదివారం 17న వి ఆర్ ఒన్ పేరుతో.. 10 కె, 5 కె, 2కె రన్ నిర్వస్తున్నామని ఆమె పేర్కొనింది. దీనికి అందరూ మద్ధతు పల్కాలని ఆమె కోరింది. ఇప్పటికే చాలా మంది యువతి యువకులు రన్ లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకుంటున్నారు దాదాపుగా 5 వేల మంది రన్ లో పాల్గొనబోతున్నారు. రన్ లో పాల్గొనే వారికి రేస్ షర్ట్స్ ఇస్తామని రన్ లో విజేతలుగా గెలిచిన వారికి బహుమతులు ఇస్తామని ఆమె పేర్కొంది. ఇక ఆదివారం నాడు పీపుల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఆమె స్పష్టం చేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: