నా భవిష్యత్తును వదులుకొని.. మీ భవిష్యత్తుకై వచ్చా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గురువారం (మార్చి 14) సాయంత్రం రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ 5వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. కొన్ని దశాబ్ధాల క్రితం నా తండ్రి చెప్పిన మాటలు గుండె ధైర్యాన్ని ఇచ్చాయన్నారు. అదే ధైర్యం కొన్ిి కోట్ల మందికి అభిమాన నటుడిని చేసిందని పవన్ అన్నారు. అదే ధైర్యం దశాబ్ధాల అనుభవమున్న ప్రతీ ఒక్కరు భయపడుతుంటే ఎదిరించి 2014 మార్చిలో జనసేన పార్టీని ప్రకటించిందన్నారు. అదే ధైర్యం రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలో చెప్పిందన్నారు. అదే ధైర్యం 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుందన్నారు. అదే ధైర్యం 2019లో ఒక కానిస్టేబుల్ కొడుకును ముఖ్యమంత్రిగా చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం పదవి పట్ల తనకు ఆసక్తి, కోరిక లేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం చేసే బాధ్యతాయుతమైన పదవిగా ముఖ్యమంత్రి పదవిని అభివర్ణించారు.

నేను చూడని డబ్బు కాదు, నేను సంపాదించని కోట్లు కాదు.. నేను వదిలేసుకున్న కోట్లు కాదు. ఒకరికి అన్యాయం జరుగుతుంటే.. చూస్తు ఊరుకోలేను. వర్గీకరించి చూడలేను. నీ దగ్గర వేల కోట్లు లేవు, టీవీ ఛానళ్లు లేవు.. నీకు అండగా ఉన్న కుర్రాళ్లంతా టీనేజర్లు. నీవు ముఖ్యమంత్రి కొడుకువు అంతకన్నా కాదు. నువ్వు రాజకీయాలు నడపలేవన్నారు. కానీ, 2014లో నేను ఒక్కటే నమ్మాను. సమాజం మారాలి, వ్యవస్థ మారాలి, మార్పు రావాలి. నాలాగే మార్పు కోరుకున్న వారికి నా మాటలు అర్థం అవుతాయని నమ్మా’ అని పవన్ అన్నారు. ‘పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు నన్ను మీరు నమ్మారు. నా ఇంట్లో వాళ్లు ఎంతగా నమ్మారో తెలీదు, బయటి వాళ్లు ఎంతగా నమ్మారో తెలీదు. నమ్మిందల్లా మీరే. మనది ఒకటే రక్తం కాదు, ఒకే కులం కాదు. మన బంధం మానవత్వం’ అని పవన్ అన్నారు.

తన భవిష్యత్తును వదులుకొని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. ‘ఎన్టీఆర్ 60 ఏళ్లు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నేను ముందే రాజకీయాల్లోకి రావడానికి కారణం.. పార్టీలు యువత భవిష్యత్తును వాడుకుంటుండటమే. మీకు పాతికేళ్ల భవిష్యత్తును ఇవ్వడానికి నా భవిష్యత్తును వదులుకొని వచ్చా’ అని పవన్ అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: