జగన్ కి షాక్.. వైస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద మృతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేకర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల లోని తన స్వగృహంలో ఇవాళ ఉదయం మరణించాడు. ముందుగా ఈయన గుండెపోటుతో చనిపోయినట్టుగా కధనాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైఎస్ అభిమానులు వివేకానంద రెడ్డి అనుచరులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యి ఆందోళన చందుతున్నారు.

ఇవాళ తెల్లవారుజామునా ఆయన తుది శ్వాస వీడినట్టు వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ వచ్చిన సమాచారం మేరకు వివేకానంద రెడ్డి రకటపు మడుగుల్లో పది ఉండటం అతని తల పై చేతి పై బలమైన గాయాలు కనిపించడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ మేయరకు వివేకానంద రెడ్డి పీఏ అయిన కృష్ణా రెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీని పై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు కూడా నమోదు చేశారు. రంగం లోకి దిగిన పోలీసులు డాగ్‌స్క్వాడ్ లని భారీ లోకి దింపి విచారణ చేస్తున్నారు.

వైఎస్ వివేకానంద రెడ్డి కేవలం రాజశేఖర్ రెడ్డి సోదరుడే కాదు ఆంధ్రప్రదేశ్ లోని తన స్వగ్రామం అయిన పులివెందుల తరఫున పలుసార్లు ఎమ్మెల్యే గా కడప నుండి ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజా శేఖర్ రెడ్డి తరువాత హయాం లో ఆయన కేబినెట్ లో భాగమై వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ని వీడి వైసీపీఉలోకి అడుగు పెట్టారు. ఇక అప్పటి నుండి జగన్ కి మంచి శ్రేయోభిలాషిగా తన వ్యవహారాలు చూసుకుంటూ తనకి సూచనలు ఇస్తూ సలహా దారు లా వ్యవహరిస్తున్నారు. నిన్న కూడా ఆయన జగన్ తో లోటస్ పాండ్ లో కొంత సేపు గడిపి అనంతరం పులివెందులలో పార్టీ తరఫున జరిపిన ప్రచారం లో కూడా పాల్పంచుకున్నాడు. ఇక అంతా సవ్యంగా ఉన్నప్పటికి నేడుతెల్లవారుజామునా ఇలా మరణించడం పై వైఎస్ కుటుంబ అనుచరులు అభిమానులు తీవ్ర దిగ్బ్రంతిని వ్యక్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: