యువ రక్తాన్ని యువ శక్తిని నమ్ముతున్నా బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ తొలి జాబితాలో వారసులకి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పెద్ద పీట వేశారు చంద్రబాబు. స్వయానా చంద్రబాబు కుమారుడు లోకేశ్ సహా దాదాపుగా 10 మందికి జాబితా లో చోటు కల్పించాడు. ఇక రెండవ లిస్ట్ లోనూ వారసులకి అవకాశాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మొదటి జాబితాలో టీడీపీ అధినేత తన కుమారుడు లోకేశ్ కి మంగళవారం టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక లోకేశ్ తో మొదలుకొని మినారిటీ విభాగం జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్‌ వరకు తమతమ వారసులకి సీటు ఖరారు చేశారు. యువ రక్తాన్ని యువ శక్తిని నమ్మి బాబు వారికి బాద్యత అప్పగించారు ఇక చూడాలి ఎవరు ఎలా భాద్యతని అవకాశాన్ని ఉపయోగించుకుంటారో.

 దివంగత నేత దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ ని ఇప్పటికే తెలుగు యువత అధ్యక్షుడిని చేశారు చంద్రబాబు ఇక నిన్న విడుదల చేసిన జాబితా లో అవినాష్ కి గుడివాడ నుండి సీటు కన్ఫామ్ చేశాడు.

 శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శివాజీ కూతురు గౌరు శిరీషకు టికెట్ ఖరారైంది.

 చీపురుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిమిలి మృణాళినికి బదులుగా ఆమె తనయుడు నాగార్జునకు సీటిచ్చారు.

 రాజమండ్రి అర్బన్ సీటును, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు, ఎర్రన్నాయుడు కుమార్తె అయిన ఆదిరెడ్డి భవానీకి ఓకే చేశారు.

 విజయవాడ వెస్ట్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌కు ఖరారు చేశారు.

 పత్తికొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీటును ఆయన కుమారుడు శ్యామ్ బాబుకు కేటాయించారు.

 ఇక రాప్తాడు నియోజకవర్గం నుండి రాప్తాడు మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ ను బరిలో దింపనున్నారు. సునీత తన స్థానాన్ని తన కుమారుడికి ఇవ్వడం జరిగింది.

 శ్రీకాళహస్తి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి టికెట్ ఓకే చేశారు చంద్రబాబు.

 నగరి సీటును దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడైన భానుప్రకాశ్‌కు ఖరారు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: