కాంగ్రెస్ బిజెపి లు వద్దు.. టి‌ఆర్‌ఎస్ ఏ ముద్దు- ఎంపీ కవిత

Google+ Pinterest LinkedIn Tumblr +

నిజమాబాద్ ఎంపీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు ఆమె మాట్లాడుతూ.. ‘19న గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే కేసీఆర్ సభకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసాం. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అందరూ సభకి రావాలని ఆమె కోరారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చేసుకుంటే ప్రజలు ఈరోజుల్లో ప్రాంతీయ పార్టీలవైపే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఐఏఎస్ అధికారుల కొరత ఉండేది అప్పుడు పార్లమెంటులోనే కోట్లాడి అధికారులని తెచ్చుకున్నాం. అలాగే రాష్ట్రంలో ఎయిమ్స్ కాలేజీ కోసం కూడా పార్లమెంట్ లోనే కోట్లాది నిధులు సాదించుకొన్నాం అని ఆమె అన్నారు.

జాతీయ పార్టీలు రాష్ట్రం కోసం చేసిన పనులంటూ ఏమి లేవు. 16+1=17 స్థానాలను గెలిపించాలని అప్పుడే పార్లమెంట్ లో అధిక నిధులు సాదించేందుకు అవకాశం ఉంటుందని, ఒక వేల కేంద్రం రాష్ట్రానికి ఏదైనా అన్యాయం చేసినా పార్లమెంట్ స్థాయిలో కొట్లాడే అవకాశం మనకి ఉంటుందని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలో 9 రాష్ట్రాలు రైతు బంధు అమలు చేస్తున్నారు. దేశంలో మోదీ కూడా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని కిసాన్ బందు అమలు చేస్తున్నారు అని ఆమె పేర్కొంది.

జాతీయ పార్టీలు మోసపూరిత మైన హామీలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లు అధికారంలో ఉన్నా ఎప్పుడూ పేదరికం గురించి పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు అధికారం కోసం దేశంలో పేదరికంపై పోరాటం చేయడం విడ్డురం అని ఆమె వ్యంగ్యంగా ఆనింది. ఇన్నేళ్లు దేశంలో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే. టిఆర్ఎస్ పార్టీకి నిండు మనసుతో ప్రజలందరి ఆశీర్వాదం ఉండాలి నిండు మనసుతో కారు గుర్తుకు ఓటేయాలి అని ఆమె ప్రజలని కోరింది. ఇక ఆమె ముగిస్తూ 19నా కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: