వివేకా మృతిపై ప్రత్యేఖ దర్యాప్తు చేస్తున్న సీట్ బృందం

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు తెల్లవారు జామునా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చందారు. ముందు గుండె పోటు తో చనిపోయారు అని కధనాలు వినిపించినప్పటికీ.. అక్కడి పరిసరాలు కాస్త అనుమానాస్పదంగా కనిపించాయి. రక్తపు మరకలతో రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆయన శవం అనేక అనుమానాలకి దారులు తీశాయి. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఏపీ పోలీస్ శాఖ.

వై.సి.పి. నేత వై.ఎస్.వివేకానంద రెడ్డి మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పి శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐ.పి.ఎస్ తెలిపారు. ఎస్పి శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా అదనపు ఎస్పి (ఆపరేషన్స్) అధ్వర్యంలో ప్రత్యెక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేసును అన్ని కోణాలలో విచారిస్తున్నామని, ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని ఎస్పి తెలిపారు. ఇప్పటికే ఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. కేసును సీరియస్ గా తీసుకున్నామని , విచారణలో ఎవరి పాత్ర అయినా వున్నట్లు తేలితే వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పి తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: