జేడీ ఇన్ జనసేన..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీ వీ లక్ష్మీనారాయణ పై అనేక వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి వస్తున్నాడని ఇందుకు గాను ఆయన అన్నీ జిల్లాలకు తిరిగి అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారని, సభలు నిర్వహిస్తున్నారని త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నారని ఇలా.. అనేక కధనాలని మనం చూశాం. ఇక గత వారం రోజుల పాటు ఆయన టీడీపీ లోకి వస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలతో ఆయన చర్చినట్టు ఇక పార్టీ లో చేరిక పై క్లారిటీ ఇచ్చేసినట్టు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇక భీమిలి నుండి ఆయన బరిలోకి దిగబోతున్నారని వార్తలు చెర్చనీయాంశాలుగా మారాయి. ఈ విషయం ఇలా ఉంటే శుక్రవారం ఆయన టీడీపీ లో చేరట్లేదాని ఒకవేళ వేరే పార్టీలో ఆయన చేరిన ఈసారి పోటీ చేయనని స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే నిన్న రాత్రి పవన్‌కళ్యాణ్‌ తో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విజయవాడలోని పార్టీ కార్యాలయం అర్ధరాత్రి ఒంటిగంటకు భేటీ అయ్యారు. ఆయనకు పవన్‌ కల్యాణ్ సాధారంగా స్వాగతం పలికారు. అక్కడ ఇద్దరూ 45 నిమిషాలపాటు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరిక ఖరారైంది. ఇక నేడు ఉదయం ఆయన పవన్ నిర్వహించిన సభలో పాల్గొన్నారు ఇక పవన్ సమక్షం లో 10.30 గంటల ప్రాంటానికి పార్టీలో చేరారు. పవన్ ఆయనకి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: