కట్నం కోసం ప్రాణం తీసిన భర్త..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆడవారిని లక్ష్మి దేవితో కొలుస్తారు.. అలాంటి ఆడవాల్లని డబ్బుతో తూకం ఎస్తున్నారు..! ఆడపిల్ల పూట్టింటిని వదిలి మెట్టింటికి వస్తుంది తన జీవితాని ఆత్తారింటికి దార పోస్తుంది.. అలాంటి ఆడపిల్ల ఇంటికొస్తే సంతోషపడి చల్లగ చూసుకోకుండా కట్నం అంటూ వేదించే కాలం వచ్చేసింది. వేధించి వేధించి ఆ ఆడపిల్ల ప్రాణాలు పొట్టనబెట్టుకుంటున్నారు కొందరు.

ఈ వేధింపులు తాళలేక అయితే ఆ అమ్మాయే ప్రాణాలు తీసుకుంటుంది లేక వేధించిన వారే ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటి సంఘటనల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ఇలాంటి సంఘటన తెలంగాణ లోని మంచిర్యాల లో చోటు చేసుకుంది. పెళ్లయ్యి పది నెలలు కూడా కాలేదు ఆ ఆమ్మాయిని కట్నం అంటూ వేధించి వేధించి హత్య చేశారు. హత్య చేసింది స్వయానా తన భార్తే అవ్వడం బాదాకరం.

వివరాల్లోకి వెళితే.. చెన్నూరు మండలంలోని పాగేపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మహిళ పాగే.లావణ్య(శారద) 25 సంవత్సరాలు.. మృతి చందింది, భర్త పాగే.రాజయ్య చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు….! మృతురాలి తరపు బంధువులు అయిన వాళ్ళ అన్న తెలిపిన దాని ప్రకారం వాళ్ళ పెళ్లై తొమ్మిది నెలలు అవుతుంది, అయితే పెళ్లి లో రెండు లక్షల కట్నం ఒప్పుకొని ఇంకా ఇవ్వలేదు అన్న నెపంతో అత్త మామ మరియు భర్త రాజయ్య ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపాడు. వేధించి వేధించి చంపారు అని వాళ్ళు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన చెన్నూర్ ఎస్సై తెల్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: