మీ భవిష్యత్తు నా బాధ్యత-బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి.. సూపర్ ఫాస్ట్ గా చంద్రబాబు ప్రజాదర్బార్ సభలు నిర్వహిస్తున్నారు శనివారం నాడు ఒక్క రోజే మూడు జిల్లాలలో ప్రచారాలు సభలు నిర్వహించారు. మూడు జిల్లాల కార్యకర్తలకి ఒకెరోజులో ఉత్సాహాన్ని పెంచాడు. ఈ సంధర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో లో నిర్వహించిన ప్రజా దర్బార్ సభలో ఆయన పాల్గొన్నారు..

ఆయన మాట్లాడుతూ.. ‘’ జిల్లా లో ఉన్న నాలుగు పార్లమెంట్ గెలిచి చరిత్ర సృష్టించాలి. తెలుగుదేశం పార్టీని మోస్తున్నది కార్యకర్తలే. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను. రాష్ట్రంలో ఎక్కువకాలం మనమే అధికారం లో ఉన్నాము. ఈ సారి కూడా అన్ని స్థానాలు మనమే గెలుస్తాము. రాష్ట్రం మొత్తం తెలుగు దేశం గాలి వీస్తుంది.. ఒక సమర్ధవంతమైన సైన్యం మన దగ్గర ఉంది. నాకు 65 లక్షల సైన్యం ఉంది నాకు. అదే నాకు దేర్యం.

ఇదొక క్లిష్టమైన సమయం… మరల తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. నాకు 98 లక్షల చెల్లమ్మలు ఉన్నారు. ఒక అన్నగా పసుపు కుంకము రెండు సార్లు ఇచ్చాను. ప్రజలు తెలుగు దేశం పార్టీ ని గుండెల్లో పెట్టుకోవాలి. నా దగ్గర పని చేసిన కేసీఆర్.. నాకు నీతులు చెబుతున్నాడా.. కబర్దార్ కేసీఆర్.. నీ ఆటలు నా దేగ్గర సాగవు..!

మీ భవిష్యత్తు నా బాధ్యత అని నేను చెబుతున్నా.. కానీ జగన్ మాత్రం నా భవిష్యత్ మీ చేతుల్లో ఉంది అంటున్నాడు. జైలుకి వెళ్లకుండా కాపాడమంటున్నాడు.. కేసీఆర్ 500 కోట్లు ఇస్తాను అని ఎక్కిరిస్తున్నాడు… మోడీ వచ్చి నీళ్లు మట్టి మా మోకాన కొట్టాడు అంతకి మించి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన చేసిందేమి లేదు.. ఒకప్పుడు జేబుల దొంగలు ఉండేవారు.. ఇప్పుడు ఓట్ల దొంగలు వచ్చేసారు.. ఆనాడు జగన్ రుణ మాఫీ సాధ్యం కాదు అని చెప్పాడు..మనం రైతులకు రుణ మాఫీ చేసాము.. పోలవరం ఈ సవంత్సరం డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని హామీ ఇస్తున్న..అని చంద్రబాబు అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: