కుప్ప కూలుతున్న కాంగ్రెస్..! కేసీఆర్ ”సెంచరీ” నాటౌట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కేసిఆర్ తెలంగాణ ఎన్నికలకి ముందు.. ఈసారి 100 స్థానాల్లో గెలుస్తామని, 100 స్థానాలు మావే అని ఎన్నోసార్లు అన్నారు కానీ ఎన్నికల రిజల్ట్ 88 దేగ్గరే ఆగిపోయింది.. ఇక ఆ 88 ని 100 చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఆయన మంచి సక్సెస్ పొందారు అనే చెప్పాలి.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి నేతలు వ్యూహాలు దిద్ది సిద్ధంగా ఉన్నారు అనడానికి కేసీఆర్ ఏ నిదర్శనం..

రోజులు దేగ్గర పడుతున్నాయి నేతలు పార్టీలు మారుతున్నారు మొన్నటివరకు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే రికార్డ్ స్థాయి లో నేతలు పార్టీ మారారు.. ఎవ్వరిని చూసిన వైసీపీ లోకి వెళుతున్నారు.. వీటి పై అనేక రూమర్స్ వచ్చాయి. ఇక మేమేమి తక్కువ కాదు అన్న రీతిలో కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ లోనూ అదే పరిస్తితి. ఎన్నికల డేట్ సమీపిస్తుంది నేతలు రోజురోజుకి ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్ లోకి వస్తున్నారు.

వరుస పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దువ్వడం మొదలుపెట్టి, చివరికి అనుకున్నది సాధించారు. ఇండిపెండెంట్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులు కలుపుకుని మొత్తం 11 మంది కారెక్కేశారు. దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 99కి చేరింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఒక స్వతంత్ర అభ్యర్ధి, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన మరో అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకోవడానికి క్యూకట్టారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కుతో మొదలైన ఈ వలసల సంఖ్య తాజాగా వనమా చేరికతో 8కి చేరింది. టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సైతం టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరు కాక మరో ముగ్గురు హస్తం శాసనసభ్యులు కూడా గులాబీ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం, ఇక దీంతో చూస్తుంటే ఇప్పటికైతే సెంచరీ దిశలో ఉన్న కేసీఆర్ రానురాను తెలంగాణలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేస్తారు అనే చెప్పొచ్చు..!

Share.

Comments are closed.

%d bloggers like this: