పబ్జీ ఆడుతూ రైలు కింద పడ్డారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యువతలో పబ్జీ పిచ్చి తారా స్థాయికి చేరుకుంటుంది.. సాదారణంగా రోజు లో కొంత సేపు కాలక్షేపం కోసం గేమ్స్ ఆడుతుంటారు. కానీ ఈ మధ్య యువత ని ఎక్కడ చూసిన ఎప్పుడు చూసినా ఫోన్లలో తలలు పెట్టి బిజీగా ఆడుతూనే ఉంటున్నారు.. చిన్న వయసు నుండి వృద్దుల దాకా అందరూ ఈ మద్య ఒక గేమ్ ఆడుతున్నారు అదే ‘పబ్జీ’.. ఇదివరకు మహా అయితే ఒక గంట పాటు గేమ్స్ ఆడే వాళ్ళు కానీ ఈ పబ్జీ వచ్చినప్పటినుండి యువత కి సమయమే తెలియట్లేదు..గంటలు తరబడి సమయాన్ని వృదా చేస్తున్నారు.. ఇది ఇలా ఉంటే ఈ గేమ్ వల్ల వాళ్ళు తీవ్ర భావోద్వేగానికి గురవ్తున్నారు.. వళ్ళు మరిచి గేమ్ లో లీనం అవుతున్నారు. పక్కన ఏం జరుగుతుందో వారికి పట్టడం లేదు.

తాజా నగేశ్ గోరె (24), స్వప్నీల్ అన్నపూర్ణే (22) అనే ఇద్దరు స్నేహితులు పబ్జీ గేమ్ ఆడటానికి రైల్వే ట్రాక్ కి వెళ్లారు ఖట్కాలీ బైపాస్ వద్ద ఉన్న ట్రాక్ పై కూర్చొని గేమ్ ఆడుతున్నారు. ఇక పక్కన ఏం జరుగుతుందో కూడా వారికి పట్టడం లేదు.. గేమ్ ఆడుతూ లోకాన్నే మరిచిపోయారు. ఈ తరహాలో ట్రైన్ వస్తున్న విషయం కూడా గమనించలేదు. ఆటలో పడి ప్రపంచం మరిచిపోయారు. ఇక హైదరాబాద్ నుంచి అజ్మేర్ వెళ్తున్న రైలు వారిని ఢీకొట్టింది దాంతో ఒక్కసారిగా ఎగిరి పడ్డారు.. అక్కడిక్కడే వారు మరణించారు. పొద్దుపోయాక ఈ శవాలని గుర్తించిన అక్కడి స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకొచ్చింది.

ఇలా ఇప్పటి వరకు అనేక కధనాలు విన్నాం చూశాం..! కొందరైతే భావోద్వేగానికి గురయ్యి పక్కనున్న వారిపై దాడి చేస్తున్నారు, మరి కొందరు వారికి వారే హాని చేసుకుంటున్నారు. మొన్న ఒకరు పక్కనున్న బాటిల్ లో నీళ్ళు ఉన్నాయని అనుకోని యాసిడ్ తాగేశాడు.. అదృష్టవశాత్తు అతని ప్రాణాలు కాపాడగలిగారు. ఒక గేమ్ వల్ల ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఇక అర్ధం చేసుకోండీ.

Share.

Comments are closed.

%d bloggers like this: