ముమ్మరంగా విచారణ..! మిస్టరీ చేదించేస్తున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో అనేక మలుపులు ఉన్నాయి. ముందుగా గుండెపోటు అని ప్రచారం జరిగింది కానీ అప్పటికే ఆయన శవం అనుమానాస్పద రీతి లో కనిపించడం తో అనుమానం మొదలయ్యింది.. పోస్ట్ మాత్రం నిమిత్తం ఆ అనుమానం నిజమైంది. అది హత్యేనని తేలిపోయింది. కేస్ ని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మా ఆధ్వర్యం లో సిట్ బృందం చేపట్టింది. ముమ్మరంగా విచారిస్తున్నారు ఇప్పటికే ఈ కేసు లో 126 మందిని విచారించారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా కేసు లో కీలకంగా ముగ్గిరి పై అనుమానాలు వ్యక్తం చేశారు సిట్ అధికారులు. ఆ ముగ్గిరోలో ఒకరౌ సుధాకర్ రెడ్డి వైఎస్ రాజా రెడ్డి హత్య కేసులో నిందితుడు. ఇంకొకరు పరమేశ్వర్ రెడ్డి వివేకా కి అత్యంత సన్నిహితుడు.. వివేకా ఇతనిని కొడుకు లా చూసుకున్నాడు. ఇంకొకరు గంగిరెడ్డి ఈయన వివేకా చుట్టం. అయితే ఇది వరకు కూడా పరమేశ్వర్ రెడ్డి ఒక హత్య చేసినట్టు తెలుస్తుంది. టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి బాబాయ్‌ని పరమేశ్వరరెడ్డి హత్య చేశాడు. ఇక సుధాకర్ రెడ్డి కొన్ని నెలల క్రితమే జైలు నుండి విడుదలయ్యాడు ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నాడు.

అయిత వివేకా హత్య తరువాత నుండి పరమేశ్వర్ రెడ్డి కనిపించడం లేదు..సోమవారం మీడియా కంటపడ్డ ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గంగిరెడ్డి తో కొద్ది రోజులుగా వివేకాకి విభేదాలు ఉన్నాయి.. ఇక ఈ కారణంగా ఆయనని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరి నుండి సమాచారాన్ని బయటకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా హత్య కి 15 రోజుల ముందే స్కెచ్ వేసినట్టు పోలీసులు వెల్లడించారు.

సరిగ్గా 15 రోజుల ముందు వివేకా ఫోన్ కి ఒక అజ్ఞాత వ్యక్తి నుండి బీ కేర్ఫుల్ అంటూ మెసేజ్ వచ్చినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఇక ఐదు రోజుల తరువాత వివేకా ఇంట్లోని పెంపుడు కుక్కని హత్య చేశారు.. కుక్క ఇంట్లో ఉంటే అరిచే అవకాశాలు ఉంటాయని ఇలా చేశారు. ఇవన్నీ చూస్తుంటే ముందే ప్లాన్ వేసినట్టు వ్యక్తమయ్యిందని పోలీస్లు తెలియజేశారు.

అయితే కొద్ది రోజులుగా వివేకానందరెడ్డి కి గంగిరెడ్డిలకి మద్య విభేదాలు తలెత్తాయి. రూపాలయాలు 125 కోట్ల మేర సెటిల్మెంట్ నడుస్తుంది. ఇద్దరు మధ్య ఏదో భూ సెటిల్మెంట్ లో భాగంగా ఈ విభేదాలు తలెత్తినట్టు పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విభేదాలే వివేకా హత్య కి దారి తీసుంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ భూమిలో కొంత భాగాన్ని గంగిరెడ్డి అమ్ముకునట్టు వివేకాకి తెలియడం తో వివేకా ఆగ్రహానికి గురయ్యాడు అప్పుడు మొదలయిన విభేదాలే ఆయన హత్యకి కారణం అయ్యుంటాయి.

ఈ సెటిల్మెంట్ లో పరమేశ్వర్ రెడ్డి గంగిరెడ్డి తో చేతులు కలిపినట్టు సమాచారం. అయితే గత కొంత కాలంగా పరమేశ్వర్ రెడ్డి వివేకా తో సరిగ్గా ప్రవర్తించట్లేదు.. వీరిద్దరి మద్య కూడా కొన్ని విభేదాలు పూతదమే దీనికి కారణం.. సెటిల్మెంట్ లో తన షేర్ గురించే విభేదాలు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక అసహనం గా ఉన్న పరమేశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా తన ప్రత్యర్డులతో చేతులు కలిపినట్టు టీడీపీ వర్గాలతో ఆయన చర్చించినట్టు తెలుస్తుంది. ఇక వారితో కొన్ని రోజుల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ రాబోతుందని సంచలనం జరగబోతుందని ఆయన తన ప్రత్యర్దలకి చెప్పినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇక మరి కొన్ని రోజుల్లో పోలీసులు వివేకా హత్య పై పూర్తి క్లారిటీ సపాదిస్తారని పేర్కొంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: