బాబు కామెంటు..! ప్రశాంత్ కిశోర్ ట్వీటు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జగన్ పొలిటికల్ అడ్వైసర్ ప్రశాంత్ కిశోర్ పేరు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈయనని పరోక్షంగా ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబే కాకుండా టీడీపీ నేతలు దేవినేని ఉమా లాంటి వాళ్ళు కూడా ఈయనని కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ కామెంట్స్ పై స్పందించారు ప్రశాంత్ కిశోర్.. ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబు కి ట్విటర్ వేధికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. చంద్రబాబు ప్రశాంత్ కిశోర్ పై చేసిన కామెంట్స్ కి ఆయన ట్విట్టర్ ద్వారా ధీటుగా సమాధానం చెప్పారు.

ఒంగోలు లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న బాబు ప్రతి పక్ష నేత జగన్ పై ఆయన్ పార్టీ పై ఘాటు విమర్శలు చేశారు. జగన్ పై ఆయన పార్టీ పైనే కాకుండా తెలంగాణ ,ఉఖ్యమంత్రి కేసీఆర్ పై జగన్ అడ్వైసర్ ప్రశాంత్ కిశోర్ లపై కూడా బాబు విమర్శలు గుప్పించారు. జగన్ ఎన్నికల వ్యూహకర్త బిహార్ డెకాయిట్ అంటూ డెకాయిట్ రాజాకీయాలు ఏపీ లో చల్లవనీ అంటే కాకుండా బిహార్ నుంచి వచ్చిన వ్యక్తులు మన వొట్లని తొలగిస్తున్నారని ఆయన ప్రశాంత్ కిశోర్ పై పరోక్ష కామెంట్స్ చేశారు.

” ఇక ఈ కామెంట్స్ కి ప్రశాంత్ కిశోర్ ట్విటర్ వేధిక గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు… త్వరలో ఓటమి వస్తుందని తెలియగానే ఎలాంటి వారైయనా ఎలాంటి రాజకీయ నేత అయిన భయానికి గురవ్తారని. ఆ భయం లో అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడుతారని ఆయన అన్నారు. ఇక ఇలాంటి భయానికి గురయిన చంద్రబాబు వ్యాఖ్యలకి ఆయన ఏమాత్రం ఆశ్చర్యపోలేదని అన్నారు.

సార్ ఇలాంటి అనైతిక భాషని వాడి వ్యాఖ్యలు చేస్తున్నారంటేనే తెలుస్తుంది మీకు బీహార్ పై ఎంత అపనమ్మకం, దురబిప్రాయం ఉందో..! మీరు బీహార్ గురించి మాట్లాడటం ఆపి ముందు ప్రజలు మీకేందుకు ఓట్లు వేయాలో ఆలోచించండి అని ఆయన ఘాటు కౌంటర్ వేశారు.”
ఇప్పుడు ఈ ట్వీటు వైరల్ అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: