గెలుపు ఖాయం జిల్లా అంతా పసుపుమయం- బాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీటు రోజురోజుకి పెరిగిపోతుంది. ఎండలు అలాగే పెరుగుతున్నాయి.. వేసవి ఎండల కన్నా హీటుగా ఉన్నాయి అక్కడి రాజకీయాలు.. అధినేతలిద్దరూ వరుసగా జెట్ స్పీడ్ తో సభలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల్లో పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని విశ్వాసాన్ని నింపుతున్నారు. ఎండలని సైతం పక్కన పెట్టి తమ ప్రియతమ నేత సభలకి వేలాదిగా హాజరవుతున్నారు అక్కడి ప్రజలు.

ఈ ప్రచారాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు కర్నూలు చేరుకున్నారు. అక్కడి ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్న ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. సభలో పాల్గొన్న బాబు మైక్ అందుకున్నారు.. ఆయన మాట్లాడుతూ..

కోట్ల, కెయి.. కుటుంబాలు కలసి అభ్యర్థులను గెలిపిస్తారు… కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీ స్థానం కు పోటీ చెస్స్తున్నారు.. ఐఏఎస్ ఆఫీసర్ అయిన రామాంజనేయులను కోడుమూరు నియోజకవర్గానికి నిలబెడుతున్నా..! కర్నూలు జిల్లాలో నియమించిన అభ్యర్థులు అందరూ నెంబర్ వన్ గా ఉన్నారు అని ఆయన అన్నారు. ఎన్నికల్లో అందరూ గెలుస్తారు. జిల్లాలో టీడీపీ జెండా రెపరేపలాడబోతుంది. జిల్లా మొత్తం పసుపుమయం చేయడం ఖాయం. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి మీ పరిధిలో ఉన్న నాయకుడిని గెలిపించండి. అలా గెలిపించిన కార్యకర్త నాకు దగ్గరవుతారు. అని ఆయన అన్నారు.

ప్రతి ఒక్క అభ్యర్థి ప్రజల వద్దకు వెళ్లి పని చేయాలని చంద్రబాబు హెచ్చరించారు. మీరు ప్రజల్ని చూసుకోండి.. నేను మిమ్మల్ని చేసుకుంటా అని ఆయన హామీ ఇచ్చారు. మీ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా.. అని నేను భరోసా మాత్రమే ఇస్తా..! కానీ మీకు అండగా ఉండేది… మీ జెండా మోసేది కార్యకర్తలే..! రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశా… ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాను… నేను హామీ ఇస్తున్నా.. మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండి.. అదుకుంటాను..! సంక్షేమ పథకాల్లో భాగంగా 200 రూపాయల నుంచి 2000 దాకా ఇస్తున్నా…! మీకు ఏ కష్టం రాకుండా చూస్తాను మీ ఆరోగ్యాలు బాగుండేలా కృషి చేస్తాను అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: