పికే నుండి మోదీ వరకూ.. అందరినీ ఏకీ పారేసిన బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడ్ తో ముందుకు దూసుకుపోతున్నారు. వరుస సభలతో విరామం లేకుండా గెలుపుకి కృషి చేస్తున్నారు. దాదాపుగా రోజంతా ఆయన షెడ్యూల్ బిజీ గానే ఉంటుంది. ఆయన షెడ్యూల్ లో మధ్యాహ్నం భోజానానికి కూడా విరామం లేదంటే ఆయన ఎంతగా కష్టపడుతున్నాడో తెలిసిపోతుంది. రోజుకి ఒక్క సభో రెండు సభలతోనో ఆపకుండా ప్రతీ రోజు దాదాపుగా మూడు నాలుగు సభలు నిర్వహిస్తున్నారు. నేడు కర్నూల్ లో ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశం సభలో ఆయన పాల్గొన్నారు. సభలో ఆయన పవన్ కల్యాణ్ తో మొదలుకొని మోదీ వరకు అందరినీ ఏకీ పారేశారు. ముఖ్యంగా జగన్ నే టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. రక్తాన్ని కడిగితే పాపం పోతుందా..? బాబాయ్ ని కిరాతకంగా నరికి చంపితే గుండె పోటు అని ఎందుకన్నారు.. పరిటాల రవిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది మ్మిరు కాదా..? ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డి ని మీరు చంపి, నేను, లోకేష్, ఆదినారాయణరెడ్డి చంపించామని అంటున్నారు. అని ఆయన అన్నారు. పొద్దున ఒకటి అని సాయంత్రానికి ప్లేటు మార్చారు అని బాబు జగన్ పై మండి పడ్డారు.

సిట్ విచారణ వద్దని జగన్ సీబీఐ విచారణ అడుగుతున్నారు.. అప్పుడు నీ అక్రమాస్తుల కేసులో జేడీ. లక్ష్మీనారాయణ ఉన్నపుడు సీబీఐ మీద నమ్మకం లేదన్నావు అప్పుడు లేని నమ్మకం ఇప్పుడెలా వచ్చింది..? దేశంలో కాపలా దారుడు మోడీ కాపాడుతాడాని సీబీఐ కావాలని అంటున్నాడు. మోదీ కాపాడటాడని జగన్ కీ నమ్మకం అందుకే సీబీఐ విచారణ ని కోరాడు అని బాబు అన్నారు.

ఎప్పుడూ ఏదో ఒక డ్రామా.. అప్పుడు కోడి కత్తి అన్నావు. ఆ కోడి కత్తితో..ఈకలు కూడా పీక లేక పోయావు. దేశంలో కాపలా దారుడు మోడీ కపడుతాడాని సీబీఐ కావాలని అంటున్నాడు..జగన్ ప్రత్యేక హోదా అడగడు, మోడీని నిలదీయలేడు. మోదీ ని నిలదీసే దమ్ము జగన్ కీ లేదు.. అసదుద్దీన్ ఓవైసీ.మైనార్టీ ఓట్లతో సీట్ల లబ్ది పొంది మోడీ కి మద్దతు పలుకుతున్నారు.. పీకే లాంటి వాళ్ళు ఏమీ పీకలేరు..మోడీ,జగన్,కేసిర్..ఒక్కటయ్యారు..మీరంతా ఏకమై..5 కోట్ల మంది ఆత్మగౌరవానికి సంబంధించిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని ఆయన ప్రజలని కోరారు. రాయలసీమ పౌరుషం చూపించాలి..దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాలి.. అని ఆయన సెలవిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: