లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ సినిమా విడుదల చేసుకోవచ్చు- హై కోర్ట్

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే ఎవ్వరికైనా ఏదో ఒక వివాదమే మనసు లోకి వస్తుంది. ఎందుకంటే ఈ దర్శకుడు ఎప్పుడూ వివాదాలను తన చుట్టూ పెట్టుకొని వాటి వెంటే పయనిస్తుంటాడు. వర్మ అంటేనే వివాదం అని తనకి ఓ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ప్రస్తుతం వర్మ లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ చిత్రం రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. ఇక వర్మ తీస్తున్న సినిమా అంటే అదో సెన్సేషనే అని చెప్పాలి పైగా అది చంద్రబాబుని విలన్ గా చూపిస్తూ తీస్తున్నాడు.. ఈ సినిమాకి అంతా ఇంతా హైప్ రావట్లేదు. ఈ విషయం ఇలా ఉంటే ఈ సినిమాని అడ్డుకోవాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే తమ పై ప్రజలకి చెడబిప్రాయం వస్తుందని ఈ సినిమా విడుదల అవ్వదని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఈ సినిమా విడుదల అవ్వకుండా టీడీపీ నేత ఒకరు ఈ సినిమా రిలీజ్ అవ్వోద్దని అయితే తమ అధినేత పై ప్రజలకి చెడు అభిప్రాయం వస్తుందని వోటర్లని ప్రభావితం చేస్తుందని ఈ సినిమా పై కోర్ట్ లో పిటిషన్ వేశారు. అయితే తాజాగా ఆ సినిమా ని ఆపాలని వేసిన పిటిషన్ పై టీ‌ఎస్ హై కోర్ట్ స్పందించింది. లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదలను ఆపటం కుదరదు అని భావ స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేమని న్యాయస్థానం పేర్కొంది. లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కలగకుండా చూడాలని చిత్రా యూనిట్ ని కోరగా పోలీసుల సహాయం తో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వర్మ అడ్వకేట్ జనరల్ సమాదానం ఇచ్చారు. దీంతో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: