పంత్ టిమ్ లో ఉండాల్సిందే- పాంటింగ్, వార్న్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ కప్ ఆటలు మొదలవుతాయి.. ఇందుకు గాను ప్రతి జట్టు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ దిశలో టీమ్ ఇండియాకి ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాళ్లు ఆస్ట్రేలియన్ కెప్టెన్ రికీ పాంటింగ్ మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ సలహా ఇచ్చారు..ఒక వేల వాళ్ళు టిమ్ ని సెలెక్ట్ చేస్తే ఎలా చేస్తారో..ఏం వ్యూహాలు పన్నుతారో చెప్పుకొచ్చారు. ఇద్దరూ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరునే ప్రస్తావించారు. అతను టిమ్ లో తప్పకుండా ఉండాలని వాళ్ళు పంత్ కి సపోర్ట్ చేశారు.

ఈ విషయం ఇలా ఉంటే మొన్న జరిగిన భారత్ ఆస్ట్రేలియా సిరీస్ లో భారత్ టీ 20 సిరీస్ ని అలాగే వన్డే సిరీస్ ని చేజార్చుకున్నారు. ఈ ఓటమికి ముఖ్య కారణం బ్యాటింగ్ ఆడర్ వైఫల్యమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మిడిల్ ఆదర్ బ్యాట్స్‌మెన్స్ ఎవ్వరూ సరిగ్గా ప్రదర్శించకపోడమే ఓటమికి కారణమని వాళ్ళు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా టిమ్ ఇండియా కి నబర్ 4 స్తానమ్ ఎప్పటినుంచూ కష్టంగా మారింది. ఆ స్థానం లో ఎవ్వరూ సరిగ్గా ప్రదర్శించడం లేదు.. అయితే ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత్ కి సలహా ఇచ్చారు. నంబర్ 4 స్థానాన్ని ఋషబ్ పంత్ కె ఇవ్వాలని ఆయన సూచించారు.. అంతర్జాతీయ అనుభవం లేకపోయినప్పటికీ పంత్ కి మ్యాచ్ ని ఆడుకునే సత్తా ఉందని తన బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ఆయన అన్నారు.

ఇక పోతే మాజీ స్పిన్ దిగ్గజం ఆస్ట్రేలియన్ బౌలర్ షేన్ వార్న్ కూడా జట్టులో తప్పకుండా ఉండాలని సూచించారు.. కానీ నాల్గవ స్థానం లో కాకుండా పంత్ ని రోహిత్ కి జతగా ఓపెన్ చేయించాలని ఆయన సూచించారు.. ఎందుకంటే రోహిత్ శర్మా దవన్ లని ఔట్ చేయడానికి అన్నీ టిమ్ లు ఇప్పటికీ వ్యూహం సిద్దం చేసేసుకుంటాయని కాబట్టి పంత్ ని ఓపెన్ కి పంపితే అతనికి ఆడటానికి సమయం కూడా సరిగ్గా సరిపోతుంది పైగా ప్రత్యర్డుల వ్యూహాలు వృధా అవుతాయి అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: