ప్రపంచపు శక్తివంతమైన మహిళల్లో ప్రియాంక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మిస్ వరల్డ్ బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా తాజాగా ప్రపంచపు 50 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈ ఇయర్‌కు గాను అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో ప్రియాంక చోటు దక్కించుకునట్టు అమెరికా కి చెందిన ప్రముఖ మ్యాగ్‌జైన్ యూ‌ఎస్‌ఏ టుడే ప్రకటించింది. యూ‌ఎస్‌ఏ టుడే మ్యాగ్‌జైన్ విమెన్ ఇన్ ది వరల్డ్ సమ్మిట్ 2019 జాబితాని ప్రకటించింది ఈ లిస్ట్ లో ప్రియాంక కి చోటు దక్కడం పై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది.. ఇది ఒక గౌరవం అని ఆమె పేర్కొంది.

ఈ జాబితా లో ప్రియాంకా తో పాటు అమెరికన్ సెలబ్రిటీ లు ఓప్రా షో నిర్వాహకురాలు ఓప్రా విన్‌ఫ్రే, గాయిని జెన్నిఫర్ లోపెజ్ నటి జెన్నిఫర్ లారెన్స్ లు కూడా ఉన్నారు. జెనిఫర్ లారెన్స్ కి ఇది వరకే ఆస్కార్ పురస్కారం కూడా వచ్చింది. మొత్తం వారి జీవితల్లో సాధించిన అన్నిటినీ ఫిల్టర్ చేసి ఈ లిస్ట్ లో చోటు కల్పిస్తారు.. ఇలాంటి లిస్ట్ లో ప్రియాంకా చోటు దక్కించుకోడం నిజంగా ఒక గౌరవమే..

ప్రస్తుతం ప్రియాంకా బాలీవుడ్ లో ది స్కై ఇస్ పింక్ సినిమా లో నటిస్తుంది ఇక రాబోయే కాలం లో చాలా బిజీగా ఉండబోతుందట.. క్వాంటికో తరహా లో ఇంకో సిక్వల్ లో ఆమె నటిస్తున్నారు, ఇక అమృన్ని హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో ఆమె బిజీ గా ఉన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: