అక్రమాలు ఆగలంటే జనసేన రావాలి- పవన్ కళ్యాణ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఆయన తన నియోజకవర్గాల్లో ఒకటైన గాజువాక స్థానం నుండి పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖాలు చేశారు. నిమినేషన్ ప్రక్రియ అనంతరం ఆయన గాజువాకలో జరిగిన సభకి హాజరయ్యారు.. గాజువాక సభలో ఆయన వైసీపీ నేతలపై టీడీపీ నేతలపై మండి పడ్డారు.. వారి అక్రమ రాజకీయాల బారిన ప్రజలు పదోద్దంటే జనసేన గెలవాలని పిలుపునిచ్చాడు.

గాజువాక సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ క్షేత్రస్ధాయి నుంచి జాతీయ స్ధాయి వరకూ సమర్ధనాయకులు కావాలి..టిడిపి, వైసిపి నాయకులకు సవాలు చేస్తున్నాం.. ఎన్నికల్లో పోటీకి నియోజకవర్గాల్లో సముజ్జీలనే పెట్టాము. మంచికి మంచే… చెడుకు చెడే.. అనే సమర్ధవంతమైన నాయకులనే పెట్టాము అని ఆయన అన్నారు. ఇతర పార్టీల్లో ఎలాంటి అభ్యర్ధులుంటారో మాపార్టీల్లోనూ అలాటివారే ఉన్నారు.. తొడలుకొట్టే వారందరూ దైర్యవంతులని గ్యారంటీ లేదు. మేము తొడలు కొత్తకపోయినా దైర్యవంతులమే అని ఆయన అన్నారు.

యలమంచిలి లో పంచకర్ల రమేష్ బాబు బస్తా బియ్యాన్ని కూడా అమ్ముకున్నారు.. విశాఖలో భూ కబ్జాలు జరుగుతున్న గంటా ఏం స్పందించడు ఏం మాట్లాడడు.. గంటాకు ఈ ఎన్నికల్లో మేము గంట మోగించబొతున్నాము. గంటా ను చట్ట సభలోకి రాకుండా చేయాలని పులిపునిచ్చారు అది గంటా పరిస్తితి అని ఆయన గంటా శ్రీనివాస్ పై విమర్శలు చేశారు.. పెందుర్తిలో వెంటక రామయ్య లాంటి సీనియర్లు అవసరం అందుకే అక్కడ ఆయనని బరిలోకి దింపుతున్నాము. పాడేరు లో టీడీపీ నేతలు భూములు కబ్జాలు చేశారు.. పెందుర్తి లో బండారు భూ కబ్జాలు ,బండారు కొడుకు ఆగడాలు ఆగాలంటే పెందుర్తి లో జనసేన గెలవాలి అని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మన చేతిలోకి రావాలి అని అన్నారు. రాజకీయాల్లో కి రావాలంటే డబ్బులు అవసరం లేదు, నిజాయితీ గల వ్యక్తి అయితే చాలు మా పార్టీ లో నిజాయితీ గల వ్యక్తులు ఉన్నారు అని ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: