23 న పవన్ మ్యానిఫెస్టో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 23వ తేది విజయవాడ నగరంలోని సెంట్రల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు జనసేన, సిపిఎం, సిపిఐ, బిఎస్‌పి నాయకులు వెల్ల‌డించారు. పవన్‌ పర్యటన వివరాలు గవర్నర్‌పేటలోని శ్రీశ్రీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల‌ సమావేశంలో వెల్ల‌డించారు. సిపిఎం పశ్చిమ కృష్ణాజిల్లా కార్యదర్శి డివి కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యు దోనేపూడి కాశీనాధ్‌, జనసేన సెంట్రల్‌ నియోజకవర్గ కన్వీనర్‌ బలిశెట్టి వంశీకృష్ణ, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షు శోడిశెట్టి కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ నగరంలోని మూడు నియోజకవర్గాలో జరిగే ఈ పర్యటనలో భాగంగా సెంట్రల్‌ నియోజకవర్గంలో జనసేన, సిపిఐ, బిఎస్‌పి బపరిచిన సిపిఎం అభ్యర్ధి సిహెచ్‌ బాబూరావు విజయాన్ని కాంక్షిస్తూ పవన్‌ కల్యాణ్‌ సెంట్రల్‌ నియోజకవర్గంలో పర్యటిస్తారన్నారు. ఆ రోజు మధ్యాహ్నం పైపుల రోడ్‌ సెంటరులో బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధుతోపాటు సిపిఐ, జనసేన, బిఎస్‌పి రాష్ట్ర నాయకులు పాల్గంటారని తెలిపారు.

రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎన్నికలో పోటీ చేస్తున్న జనసేన మ్యానిఫెస్టోను ఈ సభలో పవన్‌ కల్యాణ్‌ వ్లెడిస్తారని తెలిపారు. ఉభయ కమ్యనిస్టు పార్టీల‌ ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల‌ను వివరించే దిశగా ప్రకటన చేస్తార‌న్నారు. నిస్వార్ధ పరుడైన, నిజాయితీ గల‌ ప్రజా నాయకుడైన బాబూరావు విజయాన్ని కాంక్షిస్తూ పవన్‌కల్యాణ్‌ ప్రచారం చేయడం హర్షణీయమని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హాజరు కాబోయే సభకు, ప్రచార కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన అభిమానులు, కార్యకర్తలు, ఉభయ కమ్యునిస్టు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, బిఎస్‌పి శ్రేణులు పాల్లొని విజయవంతం చేయాల‌ని కోరారు. పవన్‌ కల్యాణ్‌ రాకకోసం సెంట్రల్‌ నియోజకవర్గంలో ప్రజలు, మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారని, ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పల‌కనున్నారని చిరంజీవి యువత ఉపాధ్యక్ష‌లు కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. ఈనె 25వ తేదిన సిపిఎం అభ్యర్థిగా సిహెచ్‌ బాబూరావు నామినేషన్‌ దాఖలు చేయనున్నారని, ఆరోజున పైపులు రోడ్‌ నుండే భారీర్యాలీ, జింఖానా మైదానంలో బహిరంగ సభ ఉంటాయని ఆ కార్యక్రమాన్ని సైతం విజయవంతంచేయాని ఈ సందర్బంగా కోరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: