ఉద్రిక్తతంగా మారుతున్న మోహన్ బాబు నిరసన..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబు తన కుమారులు విష్ణు మనోజ్ లతో కలిసి తిరుపతిలో నిరసనకి దిగారు.. ఆయన నిరసనని అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల తిరిగి చెల్లింపు విషయంలో ఆంధ్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు ఆయన నిరసన చేపడుతున్నారు.. ఆయన విద్యాసంస్థలకి కూడా ఏపీ ప్రభుత్వం దాదాపుగా 19 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని ఇది వరకు ఆయన చాలా సార్లు అన్నారు. ఈ మేరకు మోహన్ బాబు స్వయానా చంద్రబాబు కి లేఖ కూడా రాశారు. కానీ చంద్రబాబు నుండి ఎటువంటి స్పందన రానందుకే ఈ నిరసన చేపడుతున్నట్టుగా మోహన్ బాబు స్పష్టం చేశారు..

ఇది ఇలా ఉంటే ఎన్నికల కోడ్ అమలు లో ఉంది.. మోహన్ బాబు వైసీపీ కి సపోర్ట్ చేస్తారు అన్న విషయం తెలిసిందే. కాగా ఈసారి ఎన్నికల్లో ఆయన తిరుపతి నుండి పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి.. కానీ మోహన్ బాబు ఈసారి ఎటువంటి పోటీ చేయట్లేదాని స్పష్టం చేసేశాడు. ఇక ఆయన ఫీజు బకాయిల పై నిరసన చేసినప్పటికి అది ప్రచారం మాదిగానే కనిపిస్తుంది. ఇది చంద్రబాబుకి వ్యతిరేకం అయ్యే సూచనలు ఉండటంతో బాబు భారిగా పోలీసులని నిరసన స్థలానికి పంపించారు.. మోహన్ బాబు ని హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు.. మోహన్ బాబు మాత్రం ఏది ఏమైనా నిరసనని మాత్రం ఆపానని అన్నారు.. మోహన్ బాబు చేస్తున్న నిరసనకి మద్దత్తు తెలిపారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మి నారాయణ.. ఈ నిరసన పై ఆయన స్పందిస్తూ చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: