ప్రియుడి కోసం కన్నా కూతురిని హత్య చేసింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అక్రమ సంబంధమే నీచం అంటే ఈ అక్రమ సంబంధాలకి ఎవరైనా అడ్డొస్తే చాలు వారిని చంపడానికి కూడా వెనక్కి తగ్గట్లేదు.. తాజాగా వచ్చిన కథనాల ప్రకారం ఒక మహిళా కి 23 ఏళ్ల కొడుకు.. తన కొడుకు ఫ్రెండ్ తో ఈ తల్లి అక్రమ సంబంధానికి వడ గట్టింది. వీరి గుట్టు బయటపడి కొడుకు అడ్డగించడం తో ఆ కిరాటక తల్లి ప్రియుడితో కలిసి కొడుకుని చంపేసింది.. ఇక ఒక భార్య తన భారత ని ప్రియుడితో కలిసి చంపిన దృశ్యం హైడెరాబాద్ లో చోటు చేసుకుంది.. ఇక తాజాగా ఇలాంటి కేసే ఊటీ లో చోటు చేసుకుంది.. తన అక్రమ సంబంధానికి 5 వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల పాపని ఒక కిరాతక తల్లి గొంతు నులిమి చంపింది.. ఇవన్నీ చూస్తుంటే రోజురోజుకి మనుషులు మృగాలుగా తయారవుతున్నారని స్పష్టం అవుతుంది. నవ మాసాలు మోసి ఎంతో కష్టపడి రక్త మాంసాలు పంచుకొని బిడ్డల్ని కనే తల్లులే వారి పాలిట మృత్యు దేవతాళై వారిని జాలి కరుణ లేకుండా హత్యలు చేస్తున్నారు.. వీరీ అక్రమ సంబంధాలకి వారిని భళి చేస్తున్నారు.

తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటివద్ద కొడప్పమందు అంబేడ్కర్‌ కాలనీకి చెందిన కిరాతక తల్లి రాజ్యలక్ష్మి తన పదేళ్ళ కూతురిని హత్య చేసింది.. రంగంలోకి దిగిన పోలీసులకి కట్టు కథలు చెప్పింది.. చివరికి నింద తేలడంతో ఆమెని అరెస్ట్ చేశారు.. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటివద్ద కొడప్పమందు అంబేడ్కర్‌ కాలనీకి చెందిన జగన్నాథన్‌ భార్య రాజ్యలక్ష్మితో కలిసి జీవిస్తున్నాడు. వీరి కుమార్తె ఉషారాణి ఊటీలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. జగన్నాథన్, రాజ్యలక్ష్మి మనస్పర్థలతో రెండేళ్ల క్రితం విడిపోయారు. ఉషారాణి తల్లి వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే బుధవారం తన కుమార్తె ఊయల ఊగుతూ తాడు చుట్టుకుని అపస్మాకర స్థితికి వెళ్లిపోయిందంటూ రాజ్యలక్ష్మి ఊటీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తేల్చేశారు పోస్టుమార్టం నిర్వహించారు..

ఇక ఈ విషయం ఇలా ఉంటే ఉషారాణి బాబాయి ఈ కేసు పై అనుమానం వ్యక్తం చేశాడు.. పోలీసులకి ఫిర్యాదు చేశాడు, రంగం లోకి దిగిన పోలీసులు ఒక్కో విషయాన్ని బయటకి తీశారు.. ఇక విచారణ లో భాగంగా రాజ్యలక్ష్మిని ప్రశ్నలు అడిగారు.. ఆమె శైలి ఆమె జవాబులు పొంతన లేకుండా కనిపించడం తో పోలీసులు తమదైన స్టైల్ లో విచారన్ చేశారు.. ఇక ఆమెకి దారి లేక విషయాన్ని చెప్పేసింది.. తన పక్కింటి ప్రియుడితో ఆమెకి ఉన్న అక్రమ సంబంధాన్ని గురించి చెప్పి ఈ సంబంధానికి కూతురు అడ్డు కావడం తో గొంతు నులిమి చంపేశానని తేల్చేసింది. ఇక పోలీసులు సైతం ఆమె చెప్పిన సమాధానాలకి కంగు తిన్నారు.. ఆమె పై కేసు నమోదు చేసి ఆమెని అరెస్ట్ చేశారు. ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో అనెట్టుగా తయారయ్యింది సమాజం.

Share.

Comments are closed.

%d bloggers like this: