అసలు ఎవరు ఎవరిని పట్టించుకోవట్లేదు..? ఏం జరుగుతుంది..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి అలుపు లేకుండా నిలువెల్లా తన మమ కేసీఆర్ తో ఉండి ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన వ్యక్తి టీఆర్‌ఎస్ పార్టీ మేదక్ ఎమ్మెల్యే హరీష్ రావు. టీ‌ఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన నేత హరీష్ రావు ని కేసీఆర్ పక్కన పెట్టేశారా..? కేవలం ఆయన నియోజకవర్గం అయిన మేదక్ కె ఆయనని పరిమితం చేసేశారా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు అత్యంత మెజారిటీ సంపాదించారు లక్ష ఓట్ల తో విజయాన్ని దక్కించుకోవడం అంటే మామూలు మాట కాదు. కేవలం ఆయన నియోజకవర్గం లోనే కాకుండా తెలంగాణ లోని ప్రతీ నియోజకవర్గం లో హరీష్ ప్రచారం చేశారు.. టీఆర్‌ఎస్ గెలుపు గురించి కేసీఆర్ ఎంత కృషి చేశాడో హరీష్ కూడా అంటే చేశారని ఆలోచించకుండా చెప్పొచ్చు. కేసీఆర్ తరువాత ప్రచారానికి హెలికాప్టర్ వాడిన ఏకైక వ్యక్తి హరీష్ రావు.. అలాంటి హరీష్ రావుకి తెలంగాణ కేబినెట్ లో కూడా చోటు కల్పించలేకపోయాడు కేసీఆర్.

కొత్తగా పార్టీ లోకి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళకి సైతం మంత్రి పదవులని ఇచ్చిన కేసీఆర్ పగలు రాత్రి టీఆర్‌ఎస్ గెలుపు గురించి కృషి చేసిన హరీష్ రావుకి మాత్రం పదవి ఇవ్వలేకపోయారు. మరో ఆరు మంత్రి పదవులని పక్కన పెట్టిన కేసీఆర్ శాసన సభ ఎన్నికల తరువాత పదవులని కేటాయిస్తామని చెప్పారు.. అయితే ఈ 6 పధవుల్లో ఒకదానికి హరీష్ కి ఇస్తారు అని హరీష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు . కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే మాత్రం అలా కనిపించడం లేదు. హరీష్ కి ఇది వరకు ఇచ్చే గౌరవం ఇప్పుడు నేతలు ఇవ్వడం లేదు. రాష్ట్రం లో ఏం జరిగినా అందరూ కే‌టి‌ఆర్ కవితలనే కాలుస్తున్నారు తప్ప హరీష్ వైపు చూడటం లేదు.

మంత్రి పదవులు వచ్చిన నేతలు కూడా కే‌టి‌ఆర్ ని కలిసి కృతజ్ఞతలు తెల్యజేశారు తప్ప హరీష్ ని ఎవ్వరూ కలవలేదు.. ఎన్నికల ముందు కాంగ్రెస్ కోడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు హరీష్ విషయాన్ని ప్రస్తావిస్తూ అనేక సార్లు హరీష్ కి కేసీఆర్ మోసం చేయబోతున్నారని చెప్పారు.. హరీష్ చాలా మంచి వ్యక్తి అని కూడా ఆయన అన్నారు.. ఇప్ప్దుడు జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో కేసీఆర్ హరీష్ కి మొండి చేయి చూపుతారేమో అని అనిపిస్తుంది.

గత ఎన్నికల్లో కూడా హరీష్ తీసుకున్న  మంత్రి పదవులకి ఎంతగానో న్యాయం చేశాడు మిషన్ భగీరత పేరిట హరీష్ చేసిన అభివృద్దికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.. మిషన్ భగీరత మిషన్ కాకతీయ లాంటి అభివృద్ది కార్యక్రమాల్లో చెరువుల పునరాగమనం లో హరీష్ చేసిన కృషి కి టీ‌ఆర్‌ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు దక్కింది అలాంటి నేతని ఇప్పుడు కేసీఆర్ పక్కన పెట్టడం నిజంగా భావ్యం కాదు అనే చెప్పాలి. ఇక పోతే హరీష్ కేసీఆర్ ని ఎన్నికల తరువాత చాలా కొన్ని సార్లే కలిశారట.. వెల్ల మీద లెక్క పేతుకోవచ్చని హరీష్ అభిమానులు చెబుతున్నారు. అసలు వాస్తవం చూస్తుంటే హరీష్ కేసీఆర్ ని పక్కన పెడుతున్నారో కేసీఆర్ ఏ హరీష్ ని పక్కన పెడుతున్నారో అర్ధం కావడం లేదు. హరీష్ వేరే పార్టీలోకి చేరతారనే వార్తలు కూడా కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నాయి మరి నిజం ఎంటో వాస్తవాలెంటో వాళ్ళకే తెలుసు.

Share.

Comments are closed.

%d bloggers like this: