నా డబ్బు..నా పెట్టుబడులు..! జనసైనికులు ఆడపడుచులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి నేతలందరూ వరుస సభలతో మెరుపు ప్రచారాలు చేస్తున్నారు.. ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణ జిల్లా నూజివీడు లో సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జగన్ కేసీఆర్ లపై మండిపడ్డారు. వాళ్ళ పథకాల పై ఆయన ద్వజమెత్తారు.. చంద్రన్న జగనన్న పథకాలు మనకెందుకు పొట్టి శ్రీ రాములు, అబేడ్కర్ ల పథకాలు కావాలి అని ఆయన అన్నారు..! ఇక నూజివీడు ప్రజలకి వారాల వర్షం కురిపించారు, ఆయన అధికారం లోకి వస్తే ఏం చేస్తాడో వాళ్ళకి తెలియజేశాడు.

ఆయన మాట్లాడుతూ.. ఎండలో వేచి ఉన్న మన జనసైనికులకి నేను అధికారం లోకి రాగానే చల్లదనాన్ని తీసుకొస్తాను.. మీ అందరి కష్టం వృదా గా పోదు. ఏలూరు టీడీపీ ఎంపీ మాగుంట బాబు లాంటి వాళ్ళు పార్లమెంట్ లో కూడా పాడుకుంటారని అలాంటి నేతలు మనకి వద్దు అని ఆయన అన్నారు. పార్లమెంట్ లో పడుకునే వారు కాదు ప్రజల గురించి పోరాడే వాళ్ళు కావాలి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పార్టీలన్నీ డబ్బుతో రాజకీయం చేస్తున్నాయి.. నాకు డబ్బుతో అవసరం లేదు.. వాళ్ళకి డబ్బులు పెట్టుబడులు పెట్టె నేతలు ఉన్నారు.. నాకు డబ్బు తో పని లేకుండా కష్టపడే జనసైనికులు ఆడపడుచులు ఉన్నారని ఆయన అన్నారు.

కేవలం ఒక్కసారి గెలిపించండి నూజివీడుని ఎంటూ అభివృద్ది చేస్తా.. నూజివీడు ని స్మార్ట్ సిటిగా తీర్చి దిద్దుతా..! అందరికీ మెరుగైన వైద్యం అందిస్తా.. కష్టపడి పని చేసే మామిడి రైతులకి వారి పంటలకి మంచి గుర్తింపు తెప్పిస్తా.. నూజివీడుని అంతర్జాతీయ మామిడి కేంద్రం గా తయారు చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు. ఇక్కడ ఎప్పటినుండూ పెరుకుపోయిన సమస్యలని నేను పరిష్కరిస్తా..! తమిళనాడు జయలలితకు సెక్రటరీగా పని చేసిన రామ్మోహనరావును మన పార్టీ కి సలహాదారుగా నియమించా అని పవన్ ఆయనని ప్రజలకి పరిచయం చేశాడు.

నేను అధికారం లోకి రాగానే చేసే మొదటి సంతకం నెలకు 5000 పెన్షన్, రైతుకు 8000. నేను జగన్ లాగా కేసీఆర్ కింద పని చేసే కేసీఆర్ కాను సన్న లో పని చేసే వ్యక్తిని కాదు. ఇక్కడ మీరు పొరపాటున వైసీపీ ని గెలిపిస్తే ఆంధ్ర లో టీఆర్‌ఎస్ ని గెలిపించినట్టే అని ఆయన అన్నారు. చంద్రన్న పథకాలు జగనన్న పథకాలు మనకెందుకు పొట్టి శ్రీ రాములు అంబేడ్కర్ పథకాలు కావాలి నేను అధికారం లోకి వస్తే ఎలాంటి పథకాలను పెట్టను అని ఆయన అన్నారు ఇక అక్కడికి వచ్చిన పవన్ అభిమానులు పవన్ కి మామిడి కాయాలని వీణాని బహుమతిగా ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: