అ ఆ లు కూడా రాని ని కొడుక్కి మూడు ఉద్యోగాలా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల అమరావతిలో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీడియా ప్రతినిదులతో మాట్లాడినా ఆమె చంద్రబాబు ని ఆయన కుమారుడు లోకేశ్ ని ఓ ఆట ఆడుకున్నారు, తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన పై ఆయన చేసిన అభివృద్ది పై సెటైర్లు వేశారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు  అయిదేళ్ళ పాలన లో ఎక్కడా అభివృద్ది చేయలేదని కేవలం ఈ అయిదేళ్లలోనే రాష్టం 25 ఏళ్ళు వెనక్కి వెలిపోయిందని ఆమె అన్నారు. భూతద్దం పెట్టి చూసిన అభివృద్దికి గుర్తులు కూడా కనపడటం లేదని ఆమె సెటైర్లు వేశారు. వైఎస్ పాలన లో కుల మతాలకి అతీతంగా ప్రాంతాలు పార్టీయకి అతీతంగా అభివృద్ధి భరోసా ఉండేదని బాబు వచ్చాక బారోసా నే లదని ఆమె అన్నారు.

బాబు భరోసా అంటారు తప్ప ఎక్కడా ఎవ్వరికీ భరోసా ఉండదని, హామీలు ఇవ్వడం తప్ప తామీలు జరగవని ఆమె విమర్శించారు. రైతులకి రుణమాఫీ ఇస్తాం అని చెప్పి మోసాలు చేశాడని బాబు పై ఆమె మండిపడ్డారు. ఆడ పిల్ల పుడితే 25000 ఇస్తామన్నారు ఎంత మందికి వచ్చాయి అని ఆమె ప్రశ్నించారు. ఇంటికి రెండువేలు లేదా ఇంతో ఉద్యోగం అన్నారు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు..? హామీలు ఇవ్వడం తప్ప హామీలు అమలు చేయడం బాబుకి రాదని మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు మోసపూరిత హామీలు చేస్తున్నారన్నారు. ఇరిగేషన్ నుంచి ఇన్ఫ్రా స్ట్రక్చర్ వరకు వరకు నిధులు దుర్వినియోగం చేస్తున్నారు అని ఆమె బాబు పై మండిపడ్డారు.

బాబు మోడీ జోడీ కలిసి ప్రత్యేక హోదాను ఎగ్గోట్టారన్నారు. వైసీపీ నాయకులు హోదా కోసం అసెంబ్లీని ముట్టడిస్తే వారిని అరెస్టు చేయించలేదా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోడా? అని అన్నారు. ఇక లోకేశ్ పై ప్రస్తావిస్తూ..  జయంతికి వర్థంతికి కూడా తేడా తెలియని వాడు లోకేష్ అంటూ విమర్శించారు. అ ఆలు రావు కానీ అగ్రతాంబూలం అన్నాడంట అంటూ సామెతలు చెప్పి మరీ లోకేష్‌పై సెటైర్లు వేశారు. లోకేష్‌ని మూడు శాఖలకు మంత్రిని చేశారన్నారు. చంద్రబాబు కుమారుడికి మూడు ఉద్యోగాలు, మామూలు ప్రజలకు ఒక్క ఉద్యోగం కూడా లేదంటూ ఆరోపణలు చేశారు షర్మిల. ప్రజల సమాచారం మొత్తం ప్రయివేటు కంపెనీలకు ఇచ్చారన్నారు. ఇలాంటి వారిని ప్రజలు నమ్మోద్దని ఆమె ఎద్దేవా చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: