ఇక త్వరలో లక్ష్మీస్ ఎన్‌టీఆర్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచలన దర్శకుడు వివాదాస్పద కంటెంట్ ఉంటే కానీ సినిమా చేయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్‌టి‌ఆర్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయిపోయింది. ఇక రిలీజ్ కి సిద్దం అనే టైమ్ కి ఈ సినిమా చీకుల్లో పడింది. ఎప్పుడూ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా కూడా రిలీజ్ కి తంటాలు పడుతుంది. ముందు సెన్సార్ బోర్డ్ ఆ తరువాత టీడీపీ శక్తులు ఆ తరువాత ఎన్నికల సంఘం ఇలా చిక్కులు వెంటవెంటనే వచ్చి పడ్డాయి. ఒక్కొక్కటిగా చిక్కులని తీస్తూ ఇక రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఆర్జీవి ట్విట్టర్ లో 29 న విడుదల చేస్తామని ఇప్పటికే ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా నిరమాత రాకేశ్ రెడ్డి ఈ సినిమా రిలీజ్ గురించి కన్ఫామ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని సెన్సార్ బోర్డ్ ని కలిసి సనాహాలు చేస్తున్నాడు.

ఇక రాకేశ్ రెడ్డి ఈరోజే ఎన్నికల సంఘాన్ని పర్స్నల్ గా వెళ్ళి కలిశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పై వస్తున్న అభ్యంతరాలపై చిత్ర నిర్మాత ఎంసీఎంసీ కమిటీ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చారు. అంతకు ముందు ఎన్నికల సంఘం చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి ఫోన్ ద్వారా సమాధానం చెప్పాడు రాకేశ్ రెడ్డి. కానీ వ్యక్తిగతంగా రాకేశ్ రెడ్డిని ఈరోజు ఈసీ కలిశారు. వారికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని స్పెషల్ షో వేసి వాళ్ళకి చూపించారు. ఇక సెన్సార్ పనులు కూడా ఈరోజు పూర్తయిపోతాయని పోర్టయిన తరువాత సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటనఇస్తామని ఆయన పేర్కొన్నాడు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: