స్టేజి పై ”ఐ లవ్ యు” చెప్పిన ఆలియా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంతకాలంగా ఆలియా భట్ రణబీర్ కపూర్ లు ప్రేమయానం కొనసాగిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళుతున్నారు ఫోటోలు వీడియో లతో సందడి చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ నగర్ లో వీళ్ళదే హాట్ టాపిక్. అయితే తాజాగా ఈ అమ్మడుకి రాజీ సినిమాకి గాను ఉత్తమ నటి అవార్డ్ వచ్చింది. అయితే ఈ అవార్డ్ ఫంక్షన్ కి కూడా రణబీర్ అలియా లు కలిసే వెళ్లారు. తాను అవార్డు తీసుకున్న వెంటనే మాట్లాడుతూ తనకి అవార్డు రాడానికి కష్టపడ్డా వ్యక్తులకి ఆ సినిమా దర్శకుడు చిత్రా యూనిట్ కి దాన్యవాదాలు చెప్పింది.

సాదారణంగా ఇలా అవార్డులు తీసుకోగానే అందరూ తమ జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడి ఆ అవార్డుని వారికి అంకితం చేస్తున్నాము అని చెబుతారు. ఇక ఆలియా కూడా తన జీవితం లో చాలా ముఖ్యమైన వ్యక్తి రణబీర్ అని రణబీర్ ఐ లవ్ యూ అంటూ వేదిక పైనుండి చెప్పింది, ఇక ఐ లవ్ యూ చెప్పగానే రణబీర్ సిగ్గు తో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని సంతోషం తో చిరు నవ్వులు నవ్వాడు. ఇక అందరూ చప్పట్లు కొట్టారు.. ఈ విషయం ఇలా ఉంటే తాజాగా అలియా ని ఒక రిపోర్టర్ పెళ్లి గురించి అడిగితే పెళ్ళికి ఇంకా చాలా టైమ్ ఉందని ఇప్పట్లో ఆ విషయం గురించి తను ఆలోచించడం లేదని ఆమె స్పష్టం చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: