మెరుపు సభలు.. మాటల తూటాలు..! సభలు ఇందుకేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి.. అధినేతలు మెరుపు సభలు నిర్వహిస్తున్నారు..! కానీ సభల్లో ప్రజలకి తామొస్తే ఏం చేస్తామో చెప్పట్లేదు, అవతలి వాళ్ళు వస్తే ఏం చేస్తారో.. ఎలా దోచుకుంటారో చెబుతున్నారు..! ప్రజలకి వారి మ్యానిఫెస్టో గురించి చెప్పకుండా, పేదలకి వారు అమలుచేయనున్న సంక్షేమ పథకాల గురించి అస్సాలూ చెప్పకుండా ఒకరిపై ఒకరు తారా స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.. ఎంతసేపు ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోడం తప్ప ప్రజలకి వారి వల్ల ఏమి ఉపయోగమో చెప్పే దొరనిలో వాళ్ళు కనిపించట్లేదు. బాబు సభలో జగన్ కే‌సి‌ఆర్ లపై.. జగన్ సభలో బాబు లోకేశ్ లపై ఇక పవన్ కల్యాణ్.. జగన్, చంద్రబాబు లని మరిచిపోయి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు.

ఇక తాజాగా జగన్ నిర్వహించిన సభలో జగన్ కేసీఆర్ ని వెనకేసుకొచ్చినట్టుగా మాట్లాడాడు. స్పెషల్ స్టేటస్ గురించి కేసీఆర్ నాతో కలిస్తే నీకేంటి బాధ అని ఆయన అన్నారు.. ఇక చంద్రబాబు కేసీఆర్ జగన్ కి వేయి కోట్లు ఇచ్చాడని ఆరోపణలు చేశాడు.. దీనికి స్పందిస్తూ జగన్ నాకు డబ్బులు ఇవ్వడం నువ్వు చూశావా చూస్తే నిరూపించూ అంటూ బాబు పై మండి పడ్డాడు. ఇక కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన మంగళవారం అమరావతిలో పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వచ్చినప్పుడు చేసిన నిరసనల కంటే మిన్నగా జగన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని సూచించారు.  ఏపీకి జరిగిన అన్యాయాన్ని జగన్ మరిచారేమో కానీ ప్రజలు మరువలేదని ఎద్దేవా చేశారు.

కేసుల కోసం జగన్.. కేసీఆర్‌తో జతకట్టారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే జగన్ మద్ధతిచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. కేసుల మాఫీ కోసం మొత్తం ఏపీ ప్రజలతో ఊడిగం చేయించాలని జగన్ అనుకుంటున్నారని సీఎం ఆరోపించారు. ఏపీ ప్రజలు నీళ్లు తాగాలన్నా, తన దయాదాక్షిణ్యాలపైనే జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ కి వచ్చిన కష్టాలకి కేసీఆర్ ఏ కారణం అని చంద్రబాబు ఎద్దేవా చేశారు..!

Share.

Comments are closed.

%d bloggers like this: