ఉత్తర కుమారులిద్దరూ.. గాలిలో కత్తులు దూసుతున్నారు-విజయ్ సాయి రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎంపీ వైసీపీ జాతీయ జెనరల్ సెక్రెట్రీ విజయ్ సై రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎప్పుడు ఏదో ఒక హల్‌చల్ చేస్తూనే ఉంటాడు. తమ నేత జగన్ పై ఎవ్వరైన ఏదైనా విమర్శ చేయగానే వారికి కౌంటర్ ఇస్తూ ట్విట్టర్ లో ట్వీట్ల మీద ట్వీట్లు పెడతాడు. ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా కనిపిస్తాడు. జగన్ సభల్లో పాల్గొంటే విజయ్ సాయి సమిజక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళతాడు.. ఇక వీరి వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ దిద్దుతారు. అయితే విజయ్ సాయి రెడ్డి పవన్ కల్యాణ్ చంద్రబాబులని ఉద్దేశిస్తూ కొంత సేపటి క్రితం ట్వీట్లు చేశాడు వ్యంగ్యంగా విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు ఇద్దరినీ పార్టనర్ లు అంటూ ఉత్తర కుమారులు అంటూ ట్వీట్లు చేశాడు.

ఆయన చేసిన మొదటి ట్వీట్లో.. ప్రత్యర్థితో తలపడేది పోయి ఉత్తర కుమారులు నీడలతో యుద్ధం చేస్తున్నారు. తెలంగాణా సిఎం ఇక్కడకు రాలేదు. ఆయన పార్టీ పోటీలో లేదు. సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు పార్ట్నర్లు ఇద్దరు, గాలిలో కత్తులు దూసి లేని వ్యక్తితో నీకూ-మాకూ మధ్యే యుద్ధం అని పెడబొబ్బలు పెడుతున్నారు. అని ట్వీటు పోస్ట్ చేశాడు.

ఇక మరి కొద్దిసేపటికే మరో ట్వీట్లో.. పార్టనర్ కు నొప్పిలేస్తే పవన్ కళ్యాణ్ విలవిల్లాడుతున్నాడు. రిటర్న్ గిఫ్ట్ వివాదం కేసీఆర్-చంద్రబాబుల మధ్య నడుస్తోంది. ప్యాకేజీ విశ్వాసంతో ఈయన రిటర్న్ గిఫ్ట్ గురించి తెగ ఆందోళన చెందుతున్నాడు. మీ రిటర్న్ గిఫ్ట్ మేమిస్తాం. పార్టనర్ సంగతి వదిలి మీ డిపాజిట్ల కోసం పోరాడండి. అంటూ మరో ట్వీటు పోస్ట్ చేశాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: