అసలు ఎవరీ సూర్యా..! బీజేపీ ఎందుకు ఎంచుకుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బెంగళూరు లో బిజెపి పార్టీ బెంగళూరు సౌత్ ఎంపీ టికెట్ ఒక 28 ఏళ్ల యువకుడికి ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలైతే బీజేపీ నుండి ఆ స్థానంలో బీజేపీ దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి అనంత కుమార్‌ 1996 నుండి 2018 వరకు వరుసగా ఆరు సార్లు గెలిచారు. కానీ ఆయన మరణించడం తో ఆ స్థానం నుండి టికెట్ ని ఆయన సతీమణి తేజస్విని కి ఇస్తారని అందరూ భావించారు.. కానీ దీనికి అనూహ్యంగా పార్టీ ఒక 28 ఏళ్ల యువకుడికి ఇచ్చింది..

ఆ యువకుడే తేజస్వి సూర్య.. తేజస్వి సూర్య ప్రస్తుతం న్యాయవాదిగా పని చేస్తున్నారు. బెంగళూరు నగరంలో బీజేపీ యువమోర్చాకు ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. హిందూత్వ నినాదంతో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఇక అందరూ తేజస్విని కి ఇస్తారనుకుంటే తేజస్వి సూర్య పేరుని ఫైనల్ చేసింది బీజేపీ అధిష్టానం. బెంగళూరు లో ఇప్పుడు ఈ పేరు మార్మోగుతుంది.

ఇక ఈ విషయమై తేజస్వి సూర్య ట్విట్టర్ వేధిక ద్వారా స్పందిస్తూ..    నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నా. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని, అతిపెద్ద రాజకీయ పార్టీ అధ్యక్షుడు 28 ఏళ్ల యువకుడిపై విశ్వాసముంచారు. ప్రతిష్టాత్మకమైన బెంగళూరు సౌత్ నుంచి బరిలోకి దింపుతున్నారు. బీజేపీలో మాత్రమే ఇటువంటివి జరుగుతాయి. వినమ్రతతో, సంతోషంతో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మాతృభూమి కోసం నా చివరి శ్వాస వదిలేవరకు పనిచేస్తా. ఈ విధంగా మాత్రమే రుణం తీర్చుకోగలను. అంటూ ట్వీట్ చేశారు ఇక అసలు ఎవరీ సూర్యా అంటూ ప్రతిపక్ష పార్టీలు ఈయన గురించి ఆరా తీస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: