హైదరబాద్ లాంటి మరో 20 నగరాలని సిద్ధం చేస్తా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రచారాలు సభలతో బిజీగా ఉన్నారు. ఈ తరుణం లో నేడు ఆళ్లగడ్డ లో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో ఆయన కేసీఆర్ జగన్ లపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు కరువులు సమస్యలు కావు అంతకన్నా పెద్ద సమస్య జగన్ అని ఆయన జగన్ పై ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు. తెలంగాణ గడ్డ పైకి కాలు పెడితే తరిమికొడతామ్ కాళ్ళు విరగొడతామ్ అన్న కూడా మళ్ళీ వెళ్ళి కేసీఆర్ తో కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాడు. కేసీఆర్ పోతిరెడ్డి పాడుకి నీళ్ళు ఇవ్వలేదు, ముచ్చుమర్రి ప్రాజెక్ట్ ని వద్దన్నాడు, సోనియా గండి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తా అంటే ఆమెని ఇవ్వనివ్వకుండా అడ్డుపడ్డాడు. కేసీఆర్ మన రాష్ట్రానికి ద్రోహం చేశాడు అలాంటి కేసీఆర్ తో కలిసి జగన్ కూడా రాష్ట్రద్రోహిగా మిగిలిపోయాడు.

కేసీఆర్ మోడీలు కలిపి భయపెడదామని చూస్తేనే నేను భయపడలేదు ఇప్పుడు జగన్ కి ఎలా భయపడతానని అనుకుంటున్నాడు అని ఆయన జగన్ పై మండిపడ్డారు. ఆళ్లగడ్డ ని కర్నూల్ ని పట్టణం లా తీర్చిదిద్దుతాను..! ఆళ్లగడ్డ సాక్షిగా శపథం చేస్తున్నాను కేసీఆర్ కి హైదరబాద్ ఒక్కటుంటే ఆంధ్ర లో హైదరబాద లాంటి 20 గ్రామాలు సిద్ధం చేస్తున్నాను ఇదే కేసీఆర్ కి నా సవాల్. అమరవతిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతాను హైదరబాద్ లాంతో 20 నగరాలని సిద్ధం చేస్తాను నాకు ఆ సత్తా ఉంది అంటూ ఆయన అక్కడ ప్రజలతో మాట్లాడారు.

Share.

Comments are closed.

%d bloggers like this: