పెట్టిన పువ్వులు చాలు..! ముసుగు తీయి – బొత్స

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కేసీఆర్ ని ఉద్దేశిస్తూ విమర్శించిన విషయం తెలిసిందే.. ఆయన మీరు కొడుతుంటే చూస్తూ ఊరుకోము తోలు తీస్తాము.. అని అన్నారు. ఇక అప్పటినుండి ఆయన పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ ప్రస్తావిస్తూ పవన్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తోలు తీస్తాను, తొక్క తీస్తానంటున్న పవన్ రాజకీయాలు అంటే ఏమనుకుంటున్నావ్ అంటూ విరుచుకుపడ్డారు. నోరు ఉంది కదా అని వాగితే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే టీడీపీ తో కలిసి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. ని ఇష్టానికి విమర్శలు చేస్తే సరిపోతుందా ప్రజలు ని పదజాలాన్ని గమనిస్తున్నారు అంటూ ఆయన పై మండి పడ్డారు.

పవన్ గతంలో ప్రత్యక్షంగా, ఇవాళ పరోక్షంగా టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే కలసి పోటీకి రావాలని సవాల్ విసిరారు. మీరు పెట్టిన పువ్వులు చాలు ఇక చాలించండంటూ సెటైర్లు వేశారు. ప్రజలు అన్నీ గమనిస్తునే ఉన్నారు. ని బాష ని మా అధినేత బాషని వాళ్ళు గమనిస్తున్నారు వల్లే నీకు సరైన బుద్ది చెబుతారు. ఏపీని మోసం చేసిన ఏ పార్టీ అయినా మట్టికొట్టుకు పోవాల్సిందేనని బొత్స చెప్పుకొచ్చారు. ముసుగులో ఉంది యుద్ధం ఎందుకు దమ్ముంటే కలిసి పోటీకి రండి తేల్చుకుందాం అని ఆయన సవాల్ విసిరారు.

Share.

Comments are closed.

%d bloggers like this: