10 కోట్ల లాటరీ దక్కింది..! అయినా వదులుకున్నాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అసలు లాటరీ అంటేనే అదృష్టం అలాంటి లాటరీ తగిలిందంటే ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవదులుండవు..! లాటరీ విలువ 5.80 కొట్లైతే..? ఆ లాటరీ లో డబుల్ దామాకా అన్నట్టు రెండు ఫ్లాట్లు వస్తే..? అవునండి మహారాష్ట్ర లోని ఒక వ్యక్తికి ఒక లాటరీ లో ఒకేసారి 2 ఫ్లాట్లు లభించాయి. అలాంటి లాటరీ మనకి దొరికితే ఎగిరి గంటెస్తాము ఊరంతా చాటేస్తాము కానీ ఆ వ్యక్తి మాత్రం లాటరీ వచ్చినా అది కూడా 10 కోట్ల విలువ గల రెండు ఫ్లాట్లు వచ్చినా ఆ వ్యక్తి మాత్రం ఆ లాటరినీ వదులుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లోని శివసేన బృహన్ ముంబయి శాఖ అధ్యక్షుడు వినోద్ శిక్రే తాజాగా ఒక లాటరీ కాంటెస్ట్ లో పాల్గొన్నాడు.. ఆయన అదృష్టం ఫలించింది. ఒకే లాటరీలో రెండు ఫ్లాట్లు ఆయంకి దక్కాయి అవి కూడా ఒకటి 4.99 కోట్ల ఖరీదు మరొకటి 5.80 కోట్ల ఖరీదు.. అంటే 10 కోట్లకు పైమాటే..! ఈ లాటరీ వేసిన సంస్థ మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంహెచ్‌ఏడీఏ). అయితే ఈయన కూడా ముందు సంతోష పడ్డాడు. ఇక ఫ్లాటు వాస్తు చూపించడానికి నిపుణులని పిలిపించాడు. వాళ్ళు అంతా చూసి ఈ ఫ్లాటు తీసుకుంటే ని రాజకీయ భవిష్యత్తు కి కలిసిరాడని చెప్పడం తో ఆయన ఈ ఫ్లాట్లని వదులుకున్నాడు.

ఇదంతా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ.. అవును వాస్తు అచ్చిరాదని ఆయన 10 కోట్ల విలువ చేసే ఇల్లు లాటరీ లో వచ్చినా వదులుకున్నాడు. ఫ్లాటు ని తీసుకొని వేరొకరికి అమ్మోచు కదా కానీ అలా చేయలేదు. ఇక ఆయన ఫ్లాటు నిరాకరించడం తో ఈ ఫ్లాట్లను లాటరీ లిస్ట్ లో ఉన్న రెండవు విజేతకి ఇవ్వాలని సంస్థ భావిస్తుంది. ఇక ఈ వోషయం ఇలా ఉంటే లాటరీ లో పాల్గొన్న జనం మాత్రం లాటరీ ఇంత మండి వేస్తే కేవలం ఆయనొక్కడికే రావడం ఏంటి అది కూడా రెండిటికి రెండు ఆయనకే రావడం ఏంటి ఆయన వద్దనడం ఏంటి అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: