టీడీపీ నేతలా..? లేక మెడికల్ కాలేజీలా.. వీరి టార్గెట్ ఏంటి..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం పార్టీ నేతలపై ఐటీ దాడులు నిర్వహించబోతున్నారని వచ్చిన కధనాలు తెలిసినవే.. ఇక ఈక్రమంలో మొన్న నారాయణ మెడికల్ కాలేజ్ లో నేడు అమరావతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో ఐటీ సోయాదాలు జరుగుతున్నాయి. ఈ మెడికల్ కాలేజ్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఉగ్రనరసింహారెడ్డి ది. ఇక మొన్న నార్యాన మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం అమరావతి మెడికల్ కాలేజ్ లో.. రెండూ కూడా మెడికల్ విభాగానికి చెందినవే.. పైగా రెండూ కాలేజ్ లు తెలుగుదేశం పార్టీ నేతలకి చెందిన కాలేజ్ లే కావడం గమనార్హం..!

నిన్నటి నుండి సోదాలు జరుగుతూనీ ఉన్నాయి, నేటితో రెండో రోజుకి చేరుకున్న ఐటీ సోదాలు. నిన్న అక్కడికి చేరుకున్న ఐటీ అధికారులు అప్పటినుండి డాక్యుమెంట్ లు పరిశీలిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని వివిధ కోణాల్లో ప్రశనిస్తున్నారు.. ఈ ఆసుపత్రిలో భాగస్వాములు ఎవరు? ఆదాయం ఎంత వచ్చింది?  ఐటీ రిటర్నులు సమర్పించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆసుపత్రి ఆర్థిక మూలాలపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇక యజమాని ఉగ్ర నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం లో బిజీగా ఉన్నందుకు ఆయన హాస్పిటల్ చేరుకోలేకపోయారు.

Share.

Comments are closed.

%d bloggers like this: