ఇక రామ్ చరణ్ వచ్చే బర్త్‌డే కె ఫాస్ట్ లుక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు. అయితే సాదారణంగా సినిమా హీరో ల బర్త్‌డే రోజు వారి బర్త్‌డే కానుకగా అభిమానుల కోసం వారి లుక్ ని రిలీజ్ చేస్తారు చిత్ర బృందం. దర్శకుడు కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోకి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేస్తూ హీరో కి పుట్టిన రోజు శుభాకాంక్షలని తెలుపుతారు. అయితే నేడు రాంచరణ్ బర్త్‌డే.. అయితే రామ్ చరణ్ అభిమానులండరు తప్పకుండా ఆయన ఫస్ట్ లుక్ ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేడు అలాంటిదేదీ కనిపించలేదు..! ప్రస్తుతం ఆయన రాజమౌళి తీస్తున్న RRR సినిమాలో నటిస్తున్నాడు. అయితే రామ్ చరణ్ అభిమానులందరూ నేడు RRR నుండి ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారేమో చూద్దాం అని ఎంతగానో ఆశించారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. రాజమౌళి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయలేదు. ఇది వరకే రిలీజ్ చేసిన లుక్ ని మళ్ళీ పోస్ట్ చేస్తూ జన్మ దినా సుబాకాంక్షలు రామ్ చరణ్ అంటూ.. RRR అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.

సాధారణంగా రాజమౌళి సినిమా అంటే భారీ అంచనాలు..భారీ షెడ్యూల్ లు. ఈయన సినిమా తీస్తున్నారంటే అది సంవత్సరం కి తక్కువ ఏది ఉండదు. అన్నీ పెద్ద సినిమాలే 2,3 సంవత్సరాలు గ్యారంటీ..! ఇక ఆంటీ కాకుండా రాజమౌళి తో సినిమా అంటే ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. హీరో లు వారి లుక్ ని ప్రజలకి చూపించకూడదు.. పక్కాగా డైట్ పాటించాలి.. ఈ సినిమా అయ్యేంతవరకు వేరే సినిమా టచ్ చేయొద్దు.. ఇవి జక్కన్న కండిషన్స్. అయితే RRR సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కావడంతో రామ్ చరణ్ లుక్ ఇంకా సిద్ధం అవ్వలేదని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన RRR ప్రెస్ మీట్ లో కూడా ఒక విలేఖరి రాజమౌళి ని ‘’రామ్ చరణ్ బర్త్‌డే వస్తుంది మరి ఆయన లుక్ ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా’’ అనే ప్రశ్న అడగగా ఎన్‌టీఆర్ దానికి స్పందిస్తూ ఈ సంవత్సరం లో కాదు వచ్చే బర్త్‌డే కి ఎక్స్పెక్ట్ చేయండి అని ఫ్యాన్నిగా సమాధానం ఇచ్చాడు. ఇక ఆయన అన్నట్టే మరి నిజంగానే నెక్స్ట్ బర్త్‌డే కె రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వస్తుందేమో..?

Share.

Comments are closed.

%d bloggers like this: